Crime News: కాపీయింగ్ కి పాల్పడిందని యువతి డీబార్..మనస్తాపంతో యువతితో ఆత్మహత్య..!

Crime News: ప్రస్తుత కాలంలో యువత చదువుమీద దృష్టి పెట్టకుండా పరీక్షల సమయంలో కాపీయింగ్ కి పాల్పడుతున్నారు. ప్రస్తుత కాలంలో విద్య వ్యవస్థ కూడా సక్రమంగా లేనందువల్ల విద్యార్థులు భయం లేకుండా కాపీయింగ్ కి పాల్పడుతున్నారు. ఎక్కువగ అబ్బాయిలు కాపీయింగ్ చేయటం అందరికీ తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కూడా పరీక్షలలో కాపీయింగ్ కి పాల్పడుతున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే..ముళబాగిలు కు చెందిన భవ్య (19). ప్రైవేటు పీజీ హాస్టల్‌లో ఉంటూ కోరమంగల జ్యోతినివాస్‌ కాలేజీలో బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కాలేజీలో పరీక్షలు జరుగుతున్న నేపత్యంలో భవ్య పరీక్షలలో కాపీయింగ్ కి పాల్పడిందని శుక్రవారం కాలేజ్ యాజమాన్యం భవ్యాను డీబార్ చేసింది.

ఈ తరుణంలో భవ్య బాధతో తన తల్లి తండ్రులకు ఫోన్ చేసి మొత్తం విషయం చెప్పి తాను ఈ బాధ భరించలేననీ కన్నీరు పెట్టుకుంది. తాను చనిపోతానని చెప్పి ఫోన్ పెట్టేసింది. తల్లిదండ్రులు తిరిగి ఫోన్ చేయగా భవ్య స్పందించకపోవడంతో తల్లిదండ్రులు కంగారుగా బెంగళూరు బయలుదేరారు. తల్లితండ్రులు వచ్చేసరికి హాస్టల్ 5 వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకొని మరణించింది. కూతురు చావుకు కాలేజీ యాజమాన్యం కారణమని తల్లిదండ్రులు జీవన బీమానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.