Young Tiger : మరో మల్టీస్టారర్‌కి సిద్ధమవుతున్న యంగ్ టైగర్ ఎన్టీయార్.!

Young Tiger : ‘ఆర్ఆర్ఆర్’ అంటూ భారీ మల్టీస్టారర్ చేయడం కోసం సుదీర్ఘ కాలం తన డేట్స్‌ని రాజమౌళికే అప్పగించేసిన యంగ్ టైగర్ ఎన్టీయార్, తన తదుపరి సినిమాల లిస్టు విషయమై చాలా పక్కాగా వున్నాడు. ఈసారి చేయబోయే సినిమాలు చాలా వేగంగా వుంటాయట. ఏడాదికి రెండు సినిమాలు ఖచ్చితంగా రావాలనే ఆలోచనతో యంగ్ టైగర్ వున్నాడని అంటున్నారు.

చాలామంది హీరోలు ఇదే మాట చెబుతున్నా, కోవిడ్ కావొచ్చు, మరో కారణం కావొచ్చు.. ఏడాదికి ఓ సినిమా కూడా చేయలేకపోతున్న పరిస్థితి. సరే, కోవిడ్ కష్టాలు తగ్గిన దరిమిలా, ప్రముఖ నటులంతా వరుసగా తమ సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజయిన వెంటనే, యంగ్ టైగర్ ఫ్రీ అయిపోతాడు. ఆ తర్వాత తన తదుపరి సినిమాలకు సమాయత్తమవుతాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, కొరటాల శివ దర్శకత్వంలో.. ఇలా యంగ్ టైగర్ నుంచి పలు సినిమాలు రూపొందాల్సి వుంది. ఇవి కాక, ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడట యంగ్ టైగర్.

బుచ్చిబాబు ఓ మల్టీస్టారర్ కథని ఇప్పటికే యంగ్ టైగర్‌కి చెప్పాడంటున్నారు. అందులో నటించబోయే ఇంకో హీరో ఎవరన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది.