దిల్ సినిమాను ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడం వెనుక అసలు కథ ఏంటో తెలుసా?

కొన్ని సినిమా కథలు ఒక హీరో కోసం రాసినా ఆ సినిమాలలో వేరే హీరోలు నటించి సక్సెస్ సాధించిన సందర్భాలు ఇండస్ట్రీలో ఎక్కువగానే ఉన్నాయి. స్టూడెంట్ నంబర్ 1 సినిమాలోని పాటల షూటింగ్ స్విట్జర్లాండ్ లో జరుగుతున్న సమయంలో నల్లమలపు శ్రీనివాస్, వీవీ వినాయక్ జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. నల్లమలపు శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ కు సరిపడా కథ ఒకటి ఆ కథలో నటించాలని కోరారు.

అయితే వినాయక్ వేషధారణ చూసిన ఎన్టీఆర్ సినిమా విషయంలో కొంచెం సందేహించారు. హైదరాబాద్ కు వచ్చాక కలవాలని ఎన్టీఆర్ వాళ్లకు చెప్పి పంపించారు. జూనియర్ ఎన్టీఆర్ కథ విని నచ్చలేదని చెప్పి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. వినాయక్ చెప్పిన కథ విన్న జూనియర్ ఎన్టీఆర్ కు ఆ కథ ఎంతగానో నచ్చింది. ఎన్టీఆర్ కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడని వార్త ప్రచారంలోకి వచ్చింది.

ఎన్టీఆర్ వినాయక్ తో లవ్ స్టోరీ వద్దు మాస్ కథ కావాలని అడిగాడు. ఆ తర్వాత వినాయక్ ఆది సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేసి జూనియర్ ఎన్టీఆర్ ను ఒప్పించారు. అలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథ దిల్ కావడం గమనార్హం. దిల్ కథలో నటించి ఉన్నా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్ చేరేది. తక్కువ సమయంలోనే ఈ సినిమా షూట్ జరిగింది. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది.

ఆది తర్వాత నితిన్ తో దిల్ రాజు నిర్మాతగా వినాయక్ సినిమాను తెరకెక్కించగా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఆది సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు స్టూడెంట్ నంబర్1 సినిమాకు మించిన సక్సెస్ దక్కింది. ఆ తర్వాత సింహాద్రి సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తిరుగులేని మాస్ హీరోగా అవతరించారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో తారక్ బిజీగా ఉన్నారు.