Udaya Bhanu: మళ్లీ చేస్తానో లేదో గ్యారంటీ లేదు..పెద్ద సిండికేట్ ఎదిగింది ఇండస్ట్రీలో.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఉదయభాను!

Udaya Bhanu: టాలీవుడ్ ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్న పెద్ద అని తేడా లేకుండా తన మాటలతో ప్రతి ఒక్కరిని అలరిస్తూ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ఉదయభాను. ఒకప్పుడు బుల్లితెరపై స్టార్ యాంకర్ ఎవరు అనగానే ముందుగా ఉదయభాను పేరే వినిపించేది. అందానికి అందం మాటలకు మాటలు చలాకితనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఉదయభాను. మొదట హృదయాంజలి అనే కార్యక్రమంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె తర్వాత వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింబకా , డ్యాన్స్ బేబీ డ్యాన్స్, రేలారే రే రేలా, ఢీ రియాలిటీ డ్యాన్స్ షో, జాణవులే నెరజాణవులే, పిల్లలు పిడుగులు ఇలా చాలా పాపులర్ షోల్లో యాంకర్ కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

యాంకర్ గానే కాకుండా సినిమాల్లోనూ నటించింది ఉదయభాను. ఇక చాలా కాలంగా యాంకరింగ్ కు దూరంగా ఉంటున్న ఉదయభాను రీసెంట్ గా ఒక సినిమా ఈవెంట్ ను హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా మరేదో కాదు ఓ భామా అయ్యో రామ. సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి ఉదయభాను హోస్టుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉదయభాను చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన విజయ్ కనక మేడల మాట్లాడుతూ.. ఉదయభాను గారు చాలా రోజుల తర్వాత యాంకరింగ్ చేస్తున్నారు అని అన్నారు. దాంతో ఉదయభాను మాట్లాడుతూ.. ఇదొక్కటే చేశానండీ.. మళ్లీ చేస్తానో లేదో గ్యారంటీ లేదు.

రేపే ఈవెంట్ అని అనుకుంటాం కానీ.. చేసేరోజుకి మనికి ఈవెంట్ ఉండదు. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇండస్ట్రీలో. హీరో సుహాస్ మా బంగారం కాబట్టి ఏదో చేయగలిగాం మనసులో మాట కాబట్టే చెప్తున్నా అంటూ ఉదయభాను అసహనం వ్యక్తం చేశారు. అలాగే రచయిత, నటుడు మచ్చ రవి మాట్లాడుతూ.. ఉదయభాను మైక్ పట్టుకుంటే.. ఒక నారి వంద తుపాకుల టైప్ అని అన్నారు. ఆ మాటతో ఉదయభాను.. నాకు చాలా బుల్లెట్లు తగిలాయి అది ఎవరికీ తెలియదు అంటూ నవ్వుతూనే కౌంటర్ ఇచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ కామెంట్లను ఉదయభాను ప్రస్తుతం యాంకర్లుగా వ్యవహరిస్తున్న చాలా మందిని ఉద్దేశించి చేసిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.