ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకున్న అతికొద్ది మంది హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. రాజకీయాలపై ఆసక్తి ఉన్నా కొన్ని కారణాల వల్ల తారక్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే టీడీపీ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో ఫ్యాన్స్ కు సైతం అంతుచిక్కడం లేదు. బాద్ షా సినిమా సమయంలో తాను టీడీపీతోనే ఉంటానని తారక్ ప్రకటించారు.
అయితే తారక్ కు సన్నిహితులైన వల్లభనేని వంశీ మోహన్, కొడాలి నాని మాత్రం ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. మరోవైపు టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని పలు సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుకు మాత్రం టీడీపీని అధికారంలోకి తెచ్చి లోకేశ్ ను సీఎం చేయాలనే ఆలోచన అయితే ఉంది.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో యాక్టివ్ గా లేకపోవడంతో తారక్ అభిమానులు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను ఒప్పించి పార్టీ కార్యక్రమాల్లో తారక్ ను పాల్గొనేలా చేయాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. చంద్రబాబు, బాలకృష్ణ అడిగితే తారక్ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయితే రాబోయే రోజుల్లో కచ్చితంగా సీఎం అవుతారని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు. తారక్ సైలెంట్ గా ఉంటే మాత్రం పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తారక్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ హీరోగా నటించే సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుందని బోగట్టా.