రహస్యంగా పవన్ “భీమ్లా”ని ఫస్ట్ డే చూసిన యంగ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Bheemla Nayak

తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర అయితే క్రేజ్ కి కేరాఫ్ అడ్రెస్ అంటే ఎవరు అంటే అది నిర్మొహమాటంగా భారీ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. అయితే పవన్ కి ఒక్క సాధారణ ఆడియెన్స్ లోనే కాకుండా సౌత్ ఇండియా సినిమా సెలెబ్రేటిస్ లో అనేక మంది కూడా ఫ్యాన్స్ ఉన్నారు.

ఓ రకంగా సినీ ప్రముఖుల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోగా పవన్ ఉంటాడని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఓ యంగ్ అండ్ స్టార్ హీరోయిన్ కూడా చేరింది. ఆమె మరెవరో కాదు అనుపమ పరమేశ్వరన్ అట. ఈమె లేటెస్ట్ గా నిర్వహించిన చిట్ చాట్ ఇంటర్వ్యూ లో అనుపమ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మాస్ ఎంటర్టైనర్ భీమ్లా నాయక్ ని రహస్యంగా తెల్లవారు జాము షో చూసేసిందట.

ఇది షాకింగ్ అని చెప్పాలి. ఈమె హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో మార్నింగ్ షో 7 గంటలకి బురఖా వేసుకొని వెళ్లి ఈ సినిమా చూసిందట. ఈ విషయంలో తన ఫ్రెండ్స్ మాట్లాడుతుండగా ఈ అంశం రివీల్ అయ్యింది. మొత్తానికి అయితే పవన్ ఫాలోయింగ్ మాత్రం ఈ రేంజ్ లో ఉంది.