బ్రేకింగ్: హైదరాబాద్ లో మరో అమృత ఘటన.. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు…

young man murder at sangareddy

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకున్నది. మరో అమృత, ప్రణయ్ ఘటన రిపీట్ అయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇది ఖచ్చితంగా పరువు హత్యే అని ఆరోపిస్తున్నారు.

young man murder at sangareddy

తన కూతురును పెళ్లి చేసుకున్నాడని.. జీర్ణించుకోలేని అమ్మాయి తండ్రి.. యువకుడిని అతి దారుణంగా హత్య చేయించాడు. నగరంలోని చందానగర్ కు చెందిన హేమంత్ అనే యువకుడు.. అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

అయితే.. ఆ పెళ్లి యువతి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. పెళ్లి తర్వాత ఆ జంట గచ్చిబౌలిలో కాపురం ఉంటోంది. తన కూతురు తన మాట వినకుండా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తట్టుకోలేని ఆ తండ్రి.. కిరాయి హంతకులతో హేమంత్ ను హత్య చేయించాడు.

young man murder at sangareddy

గురువారం మధ్యాహ్నం.. కిరాయి హంతకులు హేమంత్, అతడి భార్యను కిడ్నాప్ చేశారు. అయితే.. కారులో నుంచి తప్పించుకున్న యువతి.. వెంటనే 100కు సమాచారం ఇచ్చింది. ఇంతలోనే హేమంత్ సంగారెడ్డిలో శవమై కనిపించాడు. ఈ ఘటనపై హేమంత్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతి తండ్రే తన కొడుకును పొట్టనపెట్టుకున్నాడని.. హేమంత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.