Road Accident: విషాదం..అత్తను ఊరికి తీసుకెళ్తూ అనంతలోకాలకు వెళ్ళిన అల్లుడు!

Road Accident: సాధారణంగా మనం ఇల్లు వదిలి ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి వస్తామనే నమ్మకం లేకుండాపోతోంది.ఈ క్రమంలోనే మార్గమధ్యంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఇంటికి చేరుకోవాల్సిన మనుషులు కాస్త అనంతలోకాలకు వెళ్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన తాంసి మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన బొమ్మన పోచన్న(25) అనే వ్యక్తి గురువారం రాత్రి 9 గంటల సమయంలో కప్పర్ల గ్రామం నుంచి తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని వెళ్తుండగా తలమడుగు మండలం ఉండం వద్ద గుర్తుతెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టి వెళ్ళిపోయింది. దీంతో పోచన్న అక్కడికక్కడే మృతి చెందగా తన అత్త తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక మృతి చెందిన పోచన్నకు భార్య ఒక కుమార్తె ఉన్నారు. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.