సీనియర్ హీరోయిన్లను లైన్‌లో పెడుతోన్న కుర్రహీరో.?

సంతోష్ శోభన్.. ‘పేపర్ బాయ్’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. హిట్, ఫట్ మాట అటుంచితే, ప్రామిసింగ్‌గా కనిపించాడీ కుర్రోడు తొలి సినిమాకే. ఆ తర్వాత సెకండ్ సినిమా కోసం బాగా గ్యాప్ తీసుకున్నాడనుకోండి. ఓ సెన్సిటివ్ స్టోరీతో వచ్చాడు. అదే ‘ఏక్ మినీ కథ’.

ప్రచార చిత్రాల్లో చూపించిన సీను ఈ సినిమాకి లేదు. కానీ, ఓకే అనిపించాడు. ఇక లేటెస్టుగా ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా కూడా అంచనాల్ని పెద్దగా అందుకోలేదనే చెప్పాలి. కానీ, అసలు విషయమేంటంటే, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మెహ్రీన్, సంతోష్‌తో పోల్చితే సీనియర్ హీరోయిన్.

తన ఖాతాలో ఆల్రెడీ చాలా సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. అలాంటి సీనియర్ హీరోయిన్‌తో మన కుర్రోడు చాలా కంఫర్టబుల్‌గా ఆన్ స్ర్కీన్ రొమాన్స్ చేసేశాడు. అది చాలదనుకున్నాడో ఏమో కానీ, తన తదుపరి సినిమా కోసం కూడా మరో సీనియర్ హీరోయిన్‌ని లైన్‌లో పెట్టేశాడట. ఆ హీరోయిన్ ఎవరనేది తెలియాలంటే ఇంకాస్త టైమ్ వెయిట్ చేయాలి.