‘కళ్యాణం కమనీయం’ జనవరి 14న సినిమా విడుదల

యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఈ సినిమాలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తాజాగా చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ వారు ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేశారు. సకుటుంబంగా చూసే ఆహ్లాదకర చిత్రమని సెన్సార్ బృందం అభినందనలను
తెలియజేశారు.

సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు వంటి మూడు భారీ చిత్రాల మధ్య ఓ ప్లెజంట్ స్మాల్ మూవీగా కళ్యాణం కమనీయం రిలీజ్ కు వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన మోషన్ పోస్టర్, ఓ మనసా, హో ఎగిరే లిరికల్ సాంగ్స్ కు మంచి ఆదరణ దక్కుతోంది. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ కావడం, ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకునే కాన్సెప్ట్ తో రూపొందడంతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. సకుటుంబంగా థియేటర్ కు వెళ్లి ఎంజాయ్ చేసే మూవీ అనే అభిప్రాయం వారిలో ఏర్పడుతోంది.

ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ – కార్తిక్ ఘట్టమనేని,
ఎడిటర్ – సత్య జి,
సంగీతం – శ్రావణ్ భరద్వాజ్,
సాహిత్యం – కృష్ణ కాంత్,
కొరియోగ్రాఫర్స్ -యష్, విజయ్ పోలంకి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – నరసింహ రాజు,
ప్రొడక్షన్ డిజైనర్ – రవీందర్,
లైన్ ప్రొడ్యూసర్ – శ్రీధర్ రెడ్డి ఆర్,
సహ నిర్మాత -అజయ్ కుమార్ రాజు పి,
పీఆర్వో – జీఎస్కే మీడియా,
నిర్మాణం – యూవీ
కాన్సెప్ట్స్, రచన దర్శకత్వం – అనిల్ కుమార్ ఆళ్ల.