Devotional Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ కు అలవాటు పడ్డాడు. అది ఎంతగా అంటే వారి ఇంట్లో ప్రతిరోజూ దీపారాధన కూడా చేయలేకపోతున్నారు. కానీ ప్రతి రోజు దీపారాధన చేయడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయని పెద్దల నమ్మకం. కానీ ఇప్పటి వారు మాత్రం ఇవి ఏవి పట్టించుకోవడం లేదు.కానీ ఇంట్లో దీపారాధన చేయడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.అందుకే ప్రతి రోజు దీపారాధన చేయాలని చెబుతారు ఇక దీపారాధన చేసే సమయం లేని వారు ఈ పద్ధతులను పాటించండి.
ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో దీపారాధన చేయలేనటువంటి సమయంలో అగరవత్తులు వెలిగించి వాటి దూపాన్ని ఇంటి మొత్తం వ్యాపించేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో దీపారాధన చేసినంత పుణ్యం దక్కుతుంది. కానీ కొంతమందికి మాత్రం ఇలా అగరవత్తులు కూడా వెలిగించే సమయం ఉండదు. అలాంటి వారు ధూప్ స్టిక్ లను ఉపయోగించవచ్చును. ఈ ధూప్ స్టిక్ లను ఉదయం వేళ కానీ సాయంత్రం వేళ కాని పూజ గదిలో వెలిగించవచ్చును.
మన జీవితంలో అన్నీ విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడి మంత్రం అయినటువంటి శుక్లాం బరధరం అనే శ్లోకన్ని స్మరించు కొన్న దీపారాధన చేసినటువంటి ఫలితం ఈ విధంగా చేయడం వల్ల దక్కుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో సమయం లేనప్పుడు ఈ విధంగా అగరు వత్తులను లేదా ధూప్ స్టిక్ లను ఉపయోగించి దీపారాధన చేసినటువంటి పుణ్యాన్ని ఈ విధంగా పొందవచ్చు