అది నేనే.! కన్‌ఫామ్ చేసిన మంత్రి అంబటి రాంబాబు.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మంత్రి అంబటి రాంబాబుకీ, జనసేన పార్టీకీ మధ్య ట్వీట్ల యుద్ధం నడుస్తోంది. ‘జనసేన పార్టీ మొత్తంగా 175 సీట్లలోనూ పోటీ చేస్తుందా.? లేదా.? కాటన్ దుస్తుల ఛాలెంజ్ వదిలేసి, పోటీ చేయబోయే సీట్లపై స్పష్టత ఇవ్వాలి..’ అంటూ అంబటి రాంబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

‘మేం ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్నది వేరే చర్చ. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టుని ఎప్పుడు పూర్తి చేసి అందిస్తారో చెప్పండి జల వనరుల శాఖ మంత్రిగారూ..’ అంటూ జనసేన పార్టీ నుంచి పలువురు నేతలు, అంబటి రాంబాబు మీద ట్వీట్ల దాడి చేశారు.

జనసేన నేత నాగబాబు అయితే, ‘ఎన్నిసార్లు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా..’ అంటూ అంబటి రాంబాబుని బఫూన్‌గా చిత్రీకరిస్తూ ఓ ఫొటోని సోషల్ మీడియాలో వదిలారు. నాగబాబు ట్వీటుపై మంత్రి అంబటి స్పందించారు. ‘భలే ఓరండీ నాగబాబుగారూ.. ఎంత ఓపిగ్గా ఎంత తీరిగ్గా నా బొమ్మేసారండీ.. ఖాళీగా ఉన్నట్లున్నారు, ధన్యవాదాలు..’ అంటూ రిప్లయ్ ఇచ్చారు అంబటి రాంబాబు.

నాగబాబు ఎందుకు ఆ బొమ్మ గీస్తారు.? అదేమైనా బ్రహ్మ విద్యా.? జస్ట్ కొద్ది నిమిషాల పని అంతే. ‘అంబటి రాంబాబు భాషలో చెప్పాలంటే.. అరగంటలో పదోవంతు సమయం కూడా ఎక్కువే’ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

‘ఖాళీగా వున్నట్టున్నారు..’ అంటూ అంబటి రాంబాబు సెటైరేయడంపైనా, జనసేన నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ‘ఇంతకీ తమరి ఖాళీ సమయాన్ని ఎక్కడ వినియోగిస్తున్నారో..’ అంటూ జనసేన మహిళా నేత రాయపాటి అరుణ ట్వీటేయడం గమనార్హం. ‘వాయిస్ నీది కాదని బుకాయించినా.. ఫేస్ నీదే అని ఒప్పుకున్నావ్ జోకర్ అంబటి రాంబాబు బాబాయ్..’ అంటూ గతంలో వెలుగు చూసిన అంబటి ఆడియో టేపుపై రాయపటి అరుణ సెటైరేశారు.

ఎందుకొచ్చిన ట్వీట్ల ప్రసహనం ఇది.? దీని వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం.?