Yellow Media : రాజకీయ వ్యభిచారం: టీడీపీ కోసం పచ్చ బ్రోకరిజం.!

Yellow Media : టీడీపీ, జనసేన పొత్తు ఖరారైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గమిదేనా.? టీడీపీ, జనసేనకు ఇవ్వబోయే సీట్లు ఇవేనా.? అధికార పంపిణీ కూడా చెరి సగం లేదా.. వచ్చిన సీట్ల లెక్క ప్రకారం వాటాలేసుకుని పంచుకుంటారా.? ఇలాంటి చర్చలు చాలానే తెరపైకొస్తున్నాయి పచ్చ మీడియాలో.

అసలు మీడియా అంటే ఏంటి.? మీడియా అంటే ప్రజలకి ఉపయోగపడేలా వుండాలి. ప్రజల్లో చైతన్యం పెంచేలా వుండాలి. అంతేగానీ, రాజకీయ పార్టీలకు కొమ్మకాస్తే ఎలా.? పచ్చ మీడియా, బులుగు మీడియా.. పెద్దగా తేడా ఏం లేదు.. రెండూ చేస్తున్నవి ఒకటే.

టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకుంటే ఏమవుతుంది.? అన్నది వేరే చర్చ. అసలంటూ ఆ రెండు పార్టీల మధ్య పొత్తుకి సానుకూలమైన వాతావరణమే లేదు. ఇప్పడసలు ఎన్నికలు జరగడంలేదు. జనసేన – బీజేపీ మధ్య చిచ్చపెట్టడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా ‘వన్ సైడ్ లవ్’ అంటూ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత బీజేపీ – జనసేన మైండ్ సెట్ మారింది.. రెండు పార్టీల మధ్య సఖ్యత పెరుగుతోంది. అది చంద్రబాబుకి కంటగింపుగా మారింది. దాన్ని, యెల్లో మీడియా జీర్ణించుకోలేకపోతోంది. ఎలాగైనా బీజేపీ – జనసేన పార్టీల మధ్య చిచ్చు రేపి, ‘యజమాని మెప్పు’ పొందడానికి పచ్చ మీడియా ‘అరాచక’ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది.

‘దీనికన్నా వ్యభిచారమే నయం..’ అన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది పచ్చ మీడియా వ్యవహారశైలిపైన.