అరరె యెల్లో ఫంగస్ కూడా వుందంట.!

Yellow Fungus Exists, And Its Is a huge Shock

Yellow Fungus Exists, And Its Is a huge Shock

తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ‘యెల్లో వైరస్’ అని విమర్శించడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏడాది కాలంగా అలవాటైపోయింది. అలాగే, వైసీపీని విమర్శించడానికి ‘బ్లూ వైరస్’ అనే ప్రస్తావన తెస్తోంది తెలుగుదేశం పార్టీ. తాజాగా ‘యెల్లో ఫంగస్’ అంటూ టీడీపీ మీద వైసీపీ విమర్శలు చేస్తోంటే, ఇది రాజకీయ విమర్శ మాత్రమే కాదు, నిజంగానే యెల్లో ఫంగస్ వుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దేశంలో యెల్లో ఫంగస్ కేసులు కూడా వెలుగు చూడటంతో అంతా అవాక్కయ్యారు. కరోనా వైరస్ నేపథ్యంలో కొత్త కొత్త ఫంగస్సుల గురించిన చర్చ తెరపైకొస్తోంది. బ్లాక్ ఫంగస్ పాతదే అయినా, కరోనా వైరస్ కారణంగానే దీనికి ఎక్కువ పాపులారిటీ లభించింది. ఈ బ్లాక్ ఫంగస్, దేశాన్ని వణికించేస్తోంది. కొందరు ఇప్పటికే ఈ ఫంగస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా, వైట్ ఫంగస్ వల్ల ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా.? అన్నదానిపై ఖచ్చితమైన సమాచారం ఇంకా లేదు. కానీ, బ్లాక్ ఫంగస్ కంటే వైట్ ఫంగస్ ప్రమాదకారి అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకోపక్క బ్లాక్ అండ్ వైట్ ఫంగస్సుల కంటే, యెల్లో ఫంగస్ ఇంకా ప్రమాదకరమైనదట. అయితే, యెల్లో ఫంగస్ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కొన్ని కేసులు వెలుగు చూశాయనే ప్రచారం జరుగుతుండగా, అధికారిక ప్రకటన ఈ అంశంపై ఇంకా వెలువడాల్సి వుంది. అసలేమవుతోందో దేశంలో, ప్రపంచంలో ఎవరికీ అర్థం కావడంలేదు. కరోనా వైరస్ విషయంలోనే యావత్ ప్రపంపంచ చేతులెత్తేసింది. కొత్త కొత్తగా వివిధ రంగుల్లో ఫంగస్సులు వెలుగు చూస్తోంటే, ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి ప్రభుత్వాలదీ, వైద్య నిపుణులదీ. సామాన్యుల పరిస్థితి మరీ దయనీయం. ప్రధానంగా కరోనా బారిన పడి కోలుకున్నవారిలో ఈ ఫంగస్సుల దాడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇమ్యూనిటీ లోపం వల్లే ఫంగస్సుల బారిన పడుతుంటారన్నది వైద్య నిపుణుల వాదన. ఆ ఇమ్యూనిటీనే వుంటే, కరోనా వైరస్ కూడా పెద్దగా ప్రభావం చూపించి వుండేది కాదు కదా.?