సరిగ్గా వెల్లంపల్లి పుట్టిన రోజు నాడే ఈవార్తను అచ్చేసిందంటే? పచ్చ మీడియా ఏ స్థాయిలో పెట్రేగిపోతుందో అర్ధమవుతోంది. మంత్రి పుట్టిన రోజు నాడే ఆయన అనుచరులు విజయవాడలో దందాలకు పాల్పడుతున్నారని ఓ విషపూరిత కథనాన్ని ప్రచురించింది. విజయవాడ మంచి బిజినెస్ ఏరియా. బెజవాడ బెంజ్ సర్కిల్, కృష్ణవేణి క్లాత్ మార్కెట్ , గొల్లపూడిలోని గాంధీ మార్కెట్, భవానీపు రం ఐరన్ యార్డ్, ఆటో నగర్ ఏరియాల్లో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంటుంది. వెల్లంపల్లి అనుచరులు సరిగ్గా అదే ఏరియాల్ని టార్గెట్ చేసి దందాలకు పాల్పడినట్లు రాసుకొచ్చింది. ఇవన్నీ తప్పుడు కథనాలు అని చెప్పాల్సిన పనిలేదు.
ఎందుకంటే ఏడాది కాలంగా పచ్చ మీడియాలో ఇలా చాలా మందిని టార్గెట్ చేసి కథనాలు వేసింది. సీఎం దగ్గర నుంచి సాధారణ కార్యకర్త పై వరకూ పచ్చ మీడియా కళ్లు పచ్చ పచ్చగానే పెట్టుకుని పనిచేస్తుంది అనడానికి మరొక సన్నివేశం ఇది. అదే కథనంలో మంత్రిపై సాప్ట్ కార్న్ చూపించే ప్రయత్నం చేసింది. శనివారం ఆయన కార్యకర్తల్ని ఎలాంటి హడావుడి చేయోద్దని..కుదిరితే సాయం చేయండని ఆయన చెప్పినట్లు అక్కర్లేని ప్రేమని ఒలకపోసిందా పచ్చ మీడియా. గతంలో అదే మీడియా దేవాదయ భూముల్లో స్కాం జరిగిందని..అందంతా వెల్లంపల్లి ఆధ్వర్యంలోనే జరిగిందని రాసుకొచ్చింది. దాన్ని మంత్రి అంతే సీరియస్ గా తీసుకుని నిరూపిస్తే రాజీనామా చేస్తానని తన నిజాయితీ నిరూపించుకున్న సంగతి తెలిసిందే.