సీఎంను నమ్మి మోసపోతున్న నేతలు.. ఇక శంకరగిరి మాన్యాలే గతి..?

ap cm jagan

 2019 ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీ ఇతర పార్టీ నేతలను బ్రతిమలాడి మరి పార్టీలోకి చేర్చుకుంది. కట్ చేస్తే 2019 ఎన్నికల తర్వాత ఇతర పార్టీ నేతలు పెరిగెత్తుకొని వెళ్లి మరి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 175 స్థానాలకు గాను 151 స్థానాలు గెలిచి రాష్ట్రంలో బండ మెజారిటీ సాధించిన వైసీపీని చూసి, ఇక రాబోయే రోజుల్లో టీడీపీలో ఉంటే కష్టమే, జగన్ హవాను తట్టుకొని బాబును పార్టీని నడిపించటం అయ్యే పని కాదని అనేక మంది టీడీపీ నేతలు వైసీపీ లోకి జంప్ అయ్యారు.

ap cm jagan

 ఇదే సమయంలో వైసీపీని టిడిపి కంటే మరింత బలోపేతం చేసేందుకు చేరికలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో నియోజకవర్గ స్థాయి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్యేలు ,ఎంపీలు, మండల స్థాయి నాయకులు ఇలా ఎంతో మంది వైసీపీ లో చేరిపోయారు. అయితే ఈ చేరికలు వలన రాబోయే రోజుల్లో వైసీపీ కి ఎంత లాభం ఉంటుందేమో కానీ, ప్రస్తుతానికి మాత్రం ఆ పార్టీలో వర్గ విభేదాలు తీవ్ర స్థాయిలో బయటపడుతున్నాయి.

 కొత్తగా వచ్చిన నేతల మూలంగా తమకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని మొదటి నుండి వైసీపీ జెండా మోస్తున్న నేతలు అధిష్టానం వద్ద చెప్పుకున్న కానీ ఎవరు పెద్దగా పట్టించుకోకపోవటంతో, ఇక డైరెక్ట్ గా ఆయా నేతలే రంగంలోకి దిగి, కొత్తగా వచ్చిన నేతలను వ్యతిరేకిస్తూ, పార్టీ క్యాడర్ ఎవరు కూడా కొత్త నేతలకు మద్దతు ఇవ్వకుండా చూస్తూ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచటంతో ఆయా నియోజకవర్గాల్లో విభేదాలు ముదురుతున్నాయి.

 టీడీపీ నుండి వైసీపీ లోకి వచ్చిన అనేక మంది నేతలు ఈ నిత్య తగాదాలతో తెగ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. దేవినేని అవినాష్ , కదిరి బాబురావు జూపూడి ప్రభాకర్, సిద్ధ రాఘవరావు, తోట త్రిమూర్తులు, రామ సుబ్బారెడ్డి లాంటి నేతలు వైసీపీ లో ఉండలేక, అలాగని టీడీపీ లోకి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. వీటిని నియోజకవర్గాల్లో మొదటి నుంచి వైసీపీలో ఉన్న నాయకులు పక్కన పెట్టినట్టు వ్యవహరిస్తున్నారు .

 అలాగే వైసిపి అధిష్టానం కూడా ఇదే విధంగా వ్యవహరిస్తూ ఉండటం , పదవుల విషయంలోనూ పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తుండడంతో, వీరి బాధ అంతా ఇంతా కాదు. ఎమ్మెల్యేలుగా ఉంది వైసీపీకి మద్దతు ఇస్తున్న నేతలు తమ చేతిలో పదవి ఉండటంతో కొంచం ఇబ్బంది లేకుండా ఎలాగోలా బండి నెట్టుకొని వస్తున్నారు, ఏ పదవి లేకుండా పార్టీ మారిన నేతలు మాత్రం సీఎం జగన్ యొక్క కరుణ కటాక్షము కోసం ఎదురుచూస్తున్నారు