తెలంగాణ: ఇటీవల తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం జరిగింది. ఈ వ్యవహారంలో సొంత పార్టీ నేతల నుండే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి సీనియర్లను ప్రసన్నం చేసుకునేందుకు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా రేవంత్ ఎన్నిక గురించి ఆంధ్ర ప్రదేశ్ వైసీపీ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్విట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు మీద నిత్యం విరుచుకుపడే విజయసాయి రెడ్డి… తెలంగాణ పీసీసీ అధ్యక్షుని నియామక వ్యవహారంలోకి బాబుని తీసుకొచ్చి తీవ్ర విమర్శలు చేశారు. “పొలిటికల్ బ్రోకర్ చంద్రబాబు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు… ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల్ని కొనిపడేసి తెలంగాణాలో తన శిష్యుడికి పీసీసీ అధ్యక్ష పీఠం ఇప్పించుకున్నాడు. కిందటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని భ్రష్టుపట్టించాడు. ఇప్పుడు డైరెక్టుగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడని” ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీని ‘ఇంప్రెస్’ చేయడానికి ఏం ‘మంత్రం’ వేశాడో గాని టీపీసీసీ అధ్యక్ష పదవికి కొత్త నేతను ఎంపిక చేయకుండా అడ్డుకున్నాడు. అన్ని అడ్డంకులు క్లియర్ చేసి తన మనిషిని పీసీసీ సీట్లో కూర్చోబెట్టాడు. తెలంగాణ బాబు కాంగ్రెస్ కమిటీ(TBCC) అనాలేమో ఇక అని విజయ సాయి విమర్శించారు. విజయసాయి వ్యాఖ్యలకు టీడీపీ వైపు నుండి కౌంటర్ వస్తుందో లేదో… చూడాలి !