ఏపీ సీఎం జగన్.. యువ ముఖ్యమంత్రి. ఆయన ఆలోచనలు కూడా ఎంతో ముందుచూపుతో ఉంటాయి. మిగితా ముఖ్యమంత్రుల్లా కాదు జగన్. ఆయన రూట్ కాస్త సపరేటు. తన పార్టీలో ఏమాత్రం అవినీతి ఉన్నా సహించేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వంలో కూడా అవినీతికి తావు లేకుండా నడిపిస్తున్నారు. ఎవరు అవినీతికి పాల్పడినా ఉపేక్షించేది లేదని నొక్కి చెప్పారు. వాళ్లు ఏ పార్టీ వాళ్లు అయినా సరే.. యాక్షన్ తీసుకుంటామన్నారు. వైఎస్సార్సీపీ నేతలకు కూడా రెండు మూడు సార్లు వార్నింగులు గట్రా ఇచ్చారు.
ఆయన పాలనలో ఇప్పటి వరకు ఎటువంటి అవినీతి ఆరోపణలు రాలేదు కానీ.. వైసీపీ ఎమ్మెల్యేలే కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. పేద ప్రజలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాల కోసం తక్కువ ధర పెట్టి భూములను దక్కించుకొని… వాటిని ఎక్కువ ధరలకు ప్రభుత్వానికే వైసీపీ నేతలు అమ్మారనేది ప్రస్తుతం ఆరోపణ.
టీడీపీ నేతలు కూడా ఇదే ఆరోపిస్తున్నారు. రాజమహేంద్రవరం నియోజకవవర్గంలో ఉన్న ఆవ భూములే ప్రత్యక్ష సాక్ష్యం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై టీడీపీ మరింత లోతుగా తవ్వుతున్నట్టు తెలుస్తోంది. ఎంత తవ్వితే అన్ని ఆధారాలు దొరుకుతున్నాయట. టీడీపీ నేత లోకేశ్ కూడా ఈ విషయంపై డైరెక్ట్ గానే వైసీపీ నేతలపై ఆరోపణలు చేశారు.
వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అవినీతికి పాల్పడ్డారు.. అని చెప్పడానికి తమ వద్ద బోలెడు ఆధారాలు ఉన్నాయంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు.
దీనిపై లోకేశ్ బాబు కూడా దూకుడుగా ఉన్నారు. వైసీపీ పాలనపై విరుచుకుపడుతున్నారు. కొన్నిరోజుల్లో 40 మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు జైలుకు వెళ్తారంటూ జోస్యం చెప్పారు. పేద ప్రజల ఇళ్ల పట్టాల కుంభకోణంలో వాళ్లు ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిందనంటూ లోకేశ్ చెప్పారు.
అయితే.. ఇళ్ల పట్టాల అవినీతికి సంబంధించిన మ్యాటర్ ఇప్పటికే జగన్ కు చేరిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై జగన్ కూడా గుర్రుగా ఉన్నారట. వైసీపీ ఎమ్మెల్యేలు ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారని తెలిసి.. సీఎం జగన్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారట. త్వరలోనే వాళ్లను పిలిచి క్లాస్ పీకే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక.. టీడీపీ కూడా దీనిపై దూకుడుతనంతోనే ఉంది. తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ వైసీపీ ప్రభుత్వాన్ని బెదిరిస్తోంది. చూద్దాం.. అసలు.. ఇదంతా నిజమేనా? పేదల ఇళ్ల పట్టాల్లో నిజంగా కుంభకోణం జరిగిందా? లేదా కావాలని టీడీపీ.. వైసీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేస్తున్నదా? అనే విషయం మాత్రం ఖచ్చితంగా తెలియడం లేదు.