నిమ్మగడ్డ ట్రాప్ లో వైసీపీ నేతలు.. వైఎస్సార్ అందుకు సాక్ష్యం

Reverse gear on SEC nimmagadda

 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అధికార పక్షం వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నా విషయం తెలిసిందే, రాజకీయ నేతలకు ఒక మెట్టు తక్కువ అన్నట్లు నిమ్మగడ్డ విమర్శలు చేస్తుంటే, వైసీపీ నేతలు ఒక మెట్టు ఎక్కువ అనేలా విమర్శలు చేస్తున్నారు. ఒక్కోసారి అధికార పార్టీ నేతలు నోరు జారుతున్న సందర్భాలు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంతో తెలివిగా వైసీపీ నేతలను తన ట్రాప్ లోకి లాగుతున్నట్లు సృష్టంగా తెలుస్తుంది.

Ambati_rambabu

 వైసీపీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు నిమ్మగడ్డ ట్రాప్ లో ప‌డ్డార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వు తున్నాయి. దివంగ‌త వైఎస్ఆర్‌ను ఎవరైనా ప్రశంసిస్తే ఆయ‌న పేరుతో పెట్టుకున్న పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు ఓర్వ‌లేర‌ని నిమ్మ‌గ‌డ్డ నిరూపించాల‌నే ప్ర‌య‌త్నం స‌త్ఫ‌లితాన్నే ఇస్తోంది. క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ వ్యూహాత్మ‌కంగా వైఎస్ఆర్‌ను తెర‌పైకి తెచ్చి పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఈ నేప‌థ్యంలో అంబ‌టి రాంబాబు మీడియా ముందుకొచ్చారు. దివంగ‌త నేత వైఎస్ఆర్ అంటే త‌న‌కు అభిమాన‌మ‌ని నిమ్మ‌గ‌డ్డ అంటున్నార‌ని, 2009లో ఆయ‌న మ‌ర‌ణిస్తే 2021లో ఆయ‌న‌కు అభిమానం పుట్టుకురావ‌డం ఏంట‌ని అంబ‌టి ప్ర‌శ్నించారు.

 2019 ఎన్నికలో టీడీపీ పార్టీని వైసీపీ చిత్తుగా ఓడించటంతో నిమ్మగడ్డ వైసీపీ పార్టీ మీద కక్ష కట్టి ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నాడని, జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంలో రాజకీయ విమర్శలు చేస్తున్నాడని అంబటి రాంబాబు ఆరోపించాడు. వైఎస్ఆర్ విగ్రహాలకు ముసుగు వేయిస్తావ్‌.. పొగుడుతావ్ అని అంబ‌టి అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అలాగే కడప ఎన్నికల రివ్యూకు వెళ్లి సీబీఐ కేసుల గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నార‌ని అంబ‌టి ప్ర‌శ్నించారు. పెన్ను, కాగితం ఉందని లేఖలు రాస్తూ మీడియాకు లీక్ చేస్తున్నార‌ని నిమ్మ‌గ‌డ్డ‌పై అంబ‌టి మండిపడ్డారు.