గీతం మెడకు ఉచ్చు బిగిస్తున్న వైసీపీ కీలక నేత

gitam

 బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కు గీతం యూనివర్సటీ కి సంబంధించిన అక్రమ కట్టడాలను కూల్చివేసిన కేసు ఇప్పుడు అనేక మలుపులు తిరుగుతుంది. గతంలో కేటాయించిన 70 ఎకరాలు కాకుండా మరో 40 ఎకరాలు కబ్జా చేసి మరి నిర్మాణాలు చేపట్టి, వాటిని క్రమబద్దీకరించాలని ప్రభుత్వాలను కోరుతూ వచ్చారు, తాజాగా జగన్ ప్రభుత్వ దగ్గరకు కూడా దాని సంబంధించిన ఫైల్ వెళ్ళటం దానిని వెనక్కి పంపటమే కాకుండా వాటిపై చర్యలకు దిగింది ప్రభుత్వం.

vijayasai reddy

  ఈ కేసు ఇంకా నడుస్తున్న సమయంలోనే గీతం మెడికల్ కాలేజ్ మీద ఎంపీ విజయసాయిరెడ్డి జాతీయ వైద్య మండలికి లేఖ రాశారు. భూముల విషయంలో సరైన డాక్యుమెంట్లు చూపించని గీతంకి ఇచ్చిన అనుమతుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. మరో వైపు ఏకంగా ఈడీకే గీతం మీద ప్రజాసంఘాల నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారు.

  గీతంకి వచ్చిన విదేశీ విరాళాల మీద విచారణ జరిపించాలని కూడా కోరడం విశేషం. గీతం తీసుకున్న బ్యాంక్ రుణాల విషయంలో కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో స్థానికుల్లో కూడా గీతం మీద వ్యతిరేకత మెల్లమెల్లగా వస్తుంది.

 దానిని కూడా వైసీపీ క్యాష్ చేసుకునే పనిలో ఉంది. గత నలభైఏళ్ల నుండి ఎదురే లేకుండా, విజయయాత్ర చేస్తున్న గీతం సంస్థలకు ఇప్పుడు జగన్ సర్కార్ రూపంలో పెద్ద స్పీడ్ బ్రేకర్ పడినట్లు అయ్యింది. మరి ఈ సమస్యను గీతం యాజమాన్యం ఏ విధంగా పరిష్కరించుకుంటుందో చూడాలి