YCP: రాయలసీమ జిల్లాలలో కడప పేరు చెబితే మొదటగా గుర్తుకు వచ్చే వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి కడపలో ఆయన మాటకు తెలుగు ఉండేది కాదు రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నన్ని రోజులు కడప రాజకీయాలను శాసించారు. ఇక రాజశేఖర్ రెడ్డి తర్వాత తన వారసుడు జగన్మోహన్ రెడ్డి కూడా కడప రాజకీయాలలో చక్రం తిప్పారు. వైయస్ కుటుంబం ఏం చెప్తే అదే శాసనంగా నడిచేది.
అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం వైసీపీకి ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి. కడప జిల్లాలో దాదాపు పది నియోజకవర్గాలలో కేవలం మూడు స్థానాలతో మాత్రమే వైసిపి సరి పెట్టుకోవడంతో అక్కడ కూడా వైసిపికి వ్యతిరేకత మొదలైందని స్పష్టం అవుతుంది.గల్లీ నుంచి జిల్లా వరకు జగన్మోహన్ రెడ్డి చెప్పుచేతల్లో ఉండేది. అటువంటి కడప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయపెడుతోంది.
కడప జిల్లాలో కడప నగరపాలక సంస్థ గుండెకాయ లాంటిది. కడప జిల్లా కేంద్రంగా రాజకీయాలను శాసించారు వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అటువంటి కడపలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేయర్ తొలగింపబడ్డారు. నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా తన కుటుంబ సభ్యులకి ఇచ్చుకున్నారని ఆరోపణలు రావడంతో విచారణ జరిపి అనంతరం ఈయనపై వేటు పడింది.
ఈ విధంగా కడప మేయర్ పోస్ట్ పోవడం వైసీపీకి ఊహించని షాక్ అని చెప్పాలి అయితే తాజాగా మైదకూరిలో కూడా అక్కడ మున్సిపల్ చైర్మన్ చంద్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన పార్టీకి అత్యంత విధేయుడు కూడా. కానీ ఆయన వాయిస్ వినేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు. రెండుసార్లు తాడేపల్లికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డిని కలవలేకపోయారు. ఇలా ఒకేసారి కడప మైదుకూరుకు చెందిన మేయర్లు వెళ్లిపోవడంతో వైసిపి రోజు రోజుకు క్షీణించపోతుందని ఇప్పటినుంచి జాగ్రత్త పడకపోతే 2029 ఎన్నికలలో కూడా వైసిపి విజయం సాధించడం కష్టమేనని పలువురు భావిస్తున్నారు.