టీడీపీ పతనం కోసమే ఆ ఇద్దరు కలిసేదట.. ఇదే జరిగితే చంద్రబాబు పరిస్దితి ఏంటి.. ??

 

ఏపీ రాజకీయాలు చదరంగాన్ని తలపిస్తున్నాయంటున్నారు కొందరు.. చేతిలో అధికారం లేక, పార్టీలో సభ్యులు తగ్గిపోయి, రేపో మాపో నాయకులు లేని నావలా టీడీపీ మారబోతుందనే ప్రచారం సాగుతున్న నేపధ్యంలో ఒకపక్క వైసీపి, మరో పక్క బీజేపీ ఒక్కటైపోతున్నాయి.. ఇక చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ మీద వ్యక్తిగతంగా ఎంతో కక్ష సాధించాడనేది ఏపీ ప్రజల్లో నుండి వచ్చే మాట.. అయితే అప్పుడున్న రాజకీయబలం, బలగం ప్రస్తుతం వైసీపీ అధినేత అయిన వైఎస్ జగన్ చేతిలో ఉన్నాయి.. కాగా ఇక్కడ వ్యక్తిగత కక్షకంటే రాజకీయంగా ఎత్తులతోనే టీడీపీ, వైసీపీ మధ్య పోరు నడుస్తుందట..

Ys jagan - Modi
Ys jagan – Modi

ఇందులో వైఎస్ జగన్ వెళ్లుతున్న దారిని గమనిస్తే మొట్టమొదటిగా తనకు రాజకీయంగా పోటీ లేకుండా చేసుకోవడం.. ఇది జరగాలంటే చంద్రబాబు ఆర్ధిక మూలాలు పూర్తిగా పెకిలించాలి, రెక్కలు లేని ఒంటరి పక్షిని చేయాలి.. ఇందుకుగానూ సీబీఐ అనే ఆయుధాన్ని బలంగా వాడాలి.. ఈడీ రంగంలోకి దిగాల్సిందే.. అప్పుడు గానీ బాబు బండారం బయటకు రాదు.. పనిలో పనిగా లోకేష్ ను కూడా ఇందులో ఇరికించాలి.. ఇలా చేస్తే గానీ వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ నీరసిస్తుంది.. చంద్రబాబు బలం నీరుగారిపోతుంది.. ఇది వైఎస్ జగన్ లక్ష్యం. ఇక బీజేపీ లక్ష్యం కూడా ఇదే అయినా ఆశ్చర్యం అవసరం లేదు. మోడీకి అన్నీ గుర్తుంటాయి. 2019 జనవరి నుండి ఏప్రిల్ మధ్యలో చంద్రబాబు ఆడిన ప్రతీ ఆట, మాట్లాడిన ప్రతి మాట మోడీ మైండ్ లో ఉంటుంది.

వాటి పర్యావసానాలు బాబుకు తెలియచేయాలని మోడీ అనుకుంటున్నాడట.. అందుకే వైఎస్ జగన్ రెండు వారాల వ్యవధిలో ఢిల్లీ వెళ్తున్నారు. మొన్నటిసారి వెళ్ళినప్పుడు బీజేపీలో చిన్న సారు అయిన అమిత్ షాని కలిశారు. ఇప్పుడు పెద్ద సారు అయినా మోడీని కలుస్తున్నారు. ఒకరకంగా దేశమే వీరిద్దరి గుప్పిట్లో ఉంది. కాగా జగన్ కి రెండు సార్లు వీళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు అంటే అందులో దాగున్న సీక్రేట్ ఏంటనే ఆసక్తి టీడీపీలో కలుగుతుందట.. ఇక ఈ విషయాన్ని మరింత సింపుల్‌గా వివరిస్తే.. వైఏస్ జగన్ గనుక ఎన్డీఏలో చేరితే బాబుకి మూడినట్టే కదా.. అదీగాక వచ్చే ఎన్నికల నాటికి నువ్వు, నేను చూసుకుందాం. ఆ బాబుని పక్కకు తోసెయ్. ఎమ్మెల్యేలను లాగేసి, కేసులు పెట్టేసి, చిందరవందర చేసేయ్.. అని బీజేపీ అంటే చంద్రబాబు పరిస్దితి ఏంటి అనే ప్రశ్న ఇక్కడ వినిపిస్తుంది.. మొత్తానికి ఆ రెండు పార్టీలు కలిసి టీడీపీని చంద్రగిరి మాన్యాలకు పంపించేలా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు..