హైదరాబాద్ కు రానున్న సిన్హా.. భారీగా ర్యాలీ ఏర్పాటు చేసిన తెరాస నాయకులు!

ఈరోజు రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. బేగంపేట విమానాశ్రయానికి గులాబీ జెండాలతో ర్యాలీ చేశారు. గోషామహల్ నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకుడు నందకిషోర్ బిలాల్ ఆధ్వర్యంలో బేగంబజార్ నుంచి బేగంపేటకు భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు.

బేగంపేట విమానాశ్రయంలో కేసీఆర్ యశ్వంత్ కు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి నెక్లెస్ రోడ్ జలవిహార్ వరకు భారీ ర్యాలీ చేపట్టనున్నారు. ఇక అక్కడే ఎంపీల, ఎమ్మెల్యేల సమక్షంలో సమావేశం కూడా ఏర్పాటు చేశారు.