క్రేజీ యుద్ధం : బాబు , జగన్ ల పేరు చెప్పి పెద్ద వార్ మొదలెట్టిన యనమల – తమ్మినేని

క్రేజీ యుద్ధం : బాబు , జగన్ ల పేరు చెప్పి పెద్ద వార్ మొదలెట్టిన యనమల – తమ్మినేని

అమరావతి:ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కొన్ని నెలల నుండి చాలా వేడిగా ఉన్నాయి. అధికార పార్టీ నేతలు, ప్రతిపక్షం పార్టీ నేతలు ఒకరినిఒకరు విమర్శించుకుంటూ, తిట్టుకుంటూ ఉన్నారు. వైసీపీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని టీడీపీ నాయకులు వ్యతిరేకించడం సహజమైంది. తాజాగా రాజధాని ఘటనపై ఇరుపార్టీల తీవ్రంగా విమర్శించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకుడు యనమల, అసెంబ్లీ స్పీకర్ సీతారాం ఒకరినిఒకరు విమర్శించుకున్నారు. రాష్ట్ర శాసనసభ నిర్ణయాలలోకి కోర్టులు జొరబడలేవని 1997 లో సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో స్పీకర్‌గా ఉన్న కాలంలో యనమల స్వయంగా ఒక తీర్పు ఇచ్చారని తమ్మినేని సీతారాం నిన్న వ్యాఖ్యలు చేయడంతో యనమల తాజాగా స్పందించారు.

శాసన సభ నిర్ణయాలు, చర్చలు చట్ట విరుద్ధమైనప్పుడు కోర్టులు జోక్యం చేసుకుంటాయని, చట్ట పరిధిలో ఉన్నప్పుడు మాత్రం కోర్టులు జోక్యం చేసుకోవని యనమల వ్యాఖ్యానించారు. తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న రాజధాని, సీఆర్డీఏ బిల్లులపై అమరావతి రైతులు వేసిన పిటిషన్స్ వల్ల కోర్టు స్టేటస్ కో ఇచ్చిందే కానీ స్టే ఇవ్వలేదని వెల్లడించారు. స్టేటస్ కో నిర్ణయంపై సుప్రీమ్ కోర్టుకు ఎలా వెళ్తారని యనమల ప్రశ్నించారు. ఇతరులపై వ్యాఖ్యలు చేసే ముందు చట్టాలపై అవగాహన పెంచుకుంటే మంచిదని సీతారాంకు సలహా ఇచ్చారు.

రాజధాని క్రెడిట్ చంద్రబాబుకు రాకూడదన్న ఉద్దేశంతోనే జగన్ ఈ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని, ఇది ప్రజలకు చేసే అన్యాయమని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మధ్య జరిగినమాటల యుద్ధంలోకి నేరుగా జగన్, చంద్రబాబుల ప్రస్తావన తెస్తూ పెద్ద దుమారానికి తెరలేపారు. స్పీకర్, మాజీ స్పీకర్ కు మధ్య చేలరిగిన మాటల యుద్ధం ఎక్కడిదాక వెళ్తుందో వేచి చూడాలి. హై కోర్ట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ. పిటిషన్ ఈ సోమవారం విచారణకు రానుంది. ఈ విచారణలో జగన్ ప్రభుత్వం ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో చూడాలి.