తెలియని వ్యక్తితో డేటింగ్ కి రెడీ.. తీరా ఆ వ్యక్తి ఎవరో తెలిసి వణికిపోయిన యువతి?

నేటి తరం యువత డేటింగ్ యాప్స్ ద్వారా అప్పటి వరకూ ఏ మాత్రం పరిచయం లేని కొత్తవారితో డేటింగ్ కు వెళ్లడం అన్నది పాశ్చాత్య దేశాల్లో ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే. ఈ డేటింగ్ యాప్స్ ద్వారా కొందరు అమ్మాయిలు,అబ్బాయిలు ఈ రకంగా తమకు కావాల్సిన డేటింగ్ పార్ట్నర్ ను ఎంచుకుంటున్నారు. అయితే తాజాగా కూడా ఇదేవిధంగా అమెరికాలో ఒక యువతి డేటింగ్ యాప్ ద్వారా ఒక యువకుడిని కలవాలని చూసింది. తీరా ఆ వ్యక్తి వివరాలు తెలిసేసరికి ఒక్కసారిగా ఆ యువతి వణికిపోయింది. అసలేం జరిగిందంటే..

అమెరికాలోని షైనాకు చెందిన కార్ట్ వెల్ అనే మహిళ ఒక కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తోంది. ఇక వీకెండ్ లో డేటింగ్ కోసం పార్టనర్ ను వెతుకుతోంది. ఈ క్రమంలోనే డేటింగ్ యాప్ ద్వారా ఆమెకు హింగే అనే ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరు చాటింగ్ ద్వారా ఒకరి అభిప్రాయాల ఒకరు తెలుసుకున్నారు. డేటింగ్ కి కూడా ఒకే అనుకున్నారు.ఆ తర్వాత కార్ట్ వెల్ అనే మహిళ తాను డేటింగ్ కు వెళ్లాలనుకుంటున్న వ్యక్తి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని భావించి గూగుల్ లో అతని పేరు సర్చ్ చేసింది. అతని గురించి మరింత లోతుగా వెళ్లి సర్చ్ చేయగా ఆమెకు ఒక కీలకమైన సమాచారం తెలిసింది. దీంతో ఆమె ఒక్కసారిగా హడలి పోయింది.

అతని గురించి తెలుసుకున్న ఆమెకు ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఆమె డేటింగ్ కు వెళ్లాలి అనుకున్న హింగే అనే వ్యక్తి ఓ కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అలా తాను ఏ మాత్రం పరిచయం లేని హింగే లాంటి వ్యక్తితో డేటింగ్ కి వెళితే ఏం జరుగుతుందో ఊహించుకొని ఒక్కసారిగా వణికిపోయింది. తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంటూ తెలియని వ్యక్తులతో డేటింగ్ కు వెళ్లే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలని కార్ట్ వెల్ సూచించింది. చాలాసార్లు ఎదుటి వ్యక్తి నిజాలు సోషల్ మీడియా ద్వారా బయట పెట్టడం లేదని, అందువల్లే గూగుల్ సహాయంతో దీనిపై పూర్తి విచారణ జరిపించాలని కార్ట్ వెల్ తెలిపింది. ఇక ఇదే విషయంపై సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఆయన మనసు చాలా మంచిది అని కొనియాడుతుండగా, ఇంకొందరు మాత్రం ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.