సొంత అన్ననే హత్య చేసిన చెల్లెలు.. వివాహేతర సంబంధమే కారణమా?

woman kills her own brother in guntur dist in ap

ఏంటో ఈ కలికాలం.. రోజురోజుకూ బంధాలు.. బంధుత్వాలు మంట కలిసి పోతున్నాయి. నేటి జనరేషన్ తమ స్వార్థం కోసం ఎవ్వరినైనా ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. సొంతవాళ్లు లేరు.. ఎవ్వరూ లేరు.. చివరకు కుటుంబ సభ్యులను చంపడానికి కూడా వెనుకాడటం లేదు అంటే ఈ సమాజం ఎక్కడికి పోతోందో అర్థం చేసుకోవచ్చు.

woman kills her own brother in guntur dist in ap

తాజాగా అటువంటి ఘటనే ఒకటి ఏపీలోని గుంటూరులో చోటు చేసుకున్నది. ఓ మహిళ సొంత అన్ననే మట్టుపెట్టింది. దారుణంగా హత్య చేసింది. గుంటూరు జిల్లాలోని బేతపూడికి చెందిన ఆదిలక్ష్మీ అనే మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది.

ఆమెకు పోతురాజు అనే అన్న ఉన్నాడు. ఆదిలక్ష్మీకి కొన్నేళ్ల క్రితం నాగరాజు అనే వ్యక్తితో పెళ్లి జరిగినా.. తర్వాత వాళ్లు విడిపోయారు. దీంతో ఆదిలక్ష్మీ తన పుట్టింటికి వచ్చి ఉంటోంది. ఈసమయంలో ఆదిలక్ష్మీకి అదే గ్రామానికి చెందిన సాంబయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ విషయం తెలుసుకున్న ఆదిలక్ష్మీ అన్న పోతురాజు.. ఆదిలక్ష్మీని బెదిరించాడు. ఇలాంటి పని చేసినందుకు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలంటూ బెదిరించాడు. ఆస్తి గురించి కూడా ఇంట్లో రోజూ గొడవలు జరుగుతుండేవి. రోజూలాగే పోతురాజు మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఎప్పటిలాగానే ఇంట్లో గొడవ జరిగింది. గొడవ పెద్దదవుతుందేమో అని ఆదిలక్ష్మీ.. సాంబయ్యను పిలుచుకొచ్చింది. వాళ్లిద్దరూ గొడవ పడటంతో పోతురాజు కింద పడ్డాడు. దీంతో అతడి తలకు గాయమైంది.

అయితే.. పోతురాజు తమను ఏం చేస్తాడో అని ఆదిలక్ష్మీ, సాంబయ్య భయపడ్డారు. అతడిని ఎలాగైనా చంపాలనుకున్నారు. దీంతో పోతురాజు నిద్రిస్తుండగా… అతడి తలపై ఆదిలక్ష్మీ గట్టిగా కొట్టింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన పోతురాజు అక్కడికక్కడ మృతి చెందాడు. పోతురాజును చంపడానికి సాంబయ్య కూడా సహకరించాడు.

ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందివ్వగా… అక్కడికి చేరుకున్న పోలీసులు.. అన్నను చంపిన ఆదిలక్ష్మీ, తనకు సహకరించిన సాంబయ్యను అరెస్ట్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.