Crime: ఎంతో ఆనందంగా సుఖంగా సాగిపోయే జీవితాలలోకి కొన్నిసార్లు ఆవేశం పెనుభూతంగా వస్తుంది. ఇలాంటి ఆవేశం వచ్చినప్పుడు తీసుకునే నిర్ణయాలు ఎంతో కఠినంగా ఉంటాయి. అలాంటి నిర్ణయం మన బిడ్డల జీవితాలను రోడ్డు పాలు చేస్తున్న ఘటనలు ఎన్నో చూసి ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. విశాఖ జిల్లా పరవాడ మండలం కన్నూరు గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఆదిరెడ్డిపాలేనికి చెందిన చింతల అప్పారావుకు మల్కాపురానికి చెందిన పెంబులి లక్ష్మి కుమార్తె రాజేశ్వరితో 2012లో వివాహం జరిగింది. వీరికి5,3 సంవత్సరాల ఇద్దరు సంతానం కలరు. ఈ దంపతులు కన్నూర్ గ్రామంలో గత ఆరు సంవత్సరాల నుంచి అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలోనే అప్పారావు కశింకోట మండలంలోని ఓ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్ గా పని చేస్తున్నాడు. అదేవిధంగా తన భార్య లక్ష్మి కూడా ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పని చేస్తోంది.
ఇలా వీరిద్దరూ టీచరుగా పని చేస్తూ ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. అయితే అప్పారావు గత కొద్ది రోజుల నుంచి లక్ష్మీ కుమార్తెకు తను పాఠశాలకు వెళ్లకుండా ఇంటిపట్టునే ఉంటూ పిల్లల ఆలనా పాలనా చూసుకోవాలని హెచ్చరించాడు. అయినా తన భర్త మాటను పెడచెవిన పెట్టి తన మొండిగా స్కూల్ కి వెళ్తుంది.ఈ క్రమంలోనే సంక్రాంతి సెలవులు పూర్తయిన తర్వాత లక్ష్మీ సోమవారం పాఠశాలకు బయల్దేరడంతో తన భర్త మరో సారి ఇదే విషయాన్ని చర్చిస్తూ తన భార్య స్కూల్ కు వెళ్లకుండా వారించాడు.దీంతో మనస్తాపం చెందిన లక్ష్మి కుమార్తె తన భర్త లుంగీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. క్షణికావేశంలో ఈమె తీసుకున్న ఈ నిర్ణయం ఇద్దరు చిన్నారులను అనాధలుగా మిగిల్చి వేసింది.