2019 ఎన్నికల్లో వైసీపీ సాధించిన విజయాన్ని ప్రజలు అప్పుడే మర్చిపోలేరు. ఆ విజయాన్ని చరిత్ర కూడా గుర్తుపెట్టుకుంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఆయనకు దాదాపు అన్ని ఎదురుదెబ్బలే తగిలాయి. తీసుకున్న అన్ని నిర్ణయాలు కోర్ట్ ల చుట్టూ తిరుగుతూ అక్కడే ఆగిపోయాయి. అలాగే కరోనా రావడంతో జగన్ తాను అనుకున్న పనులు చేయలేకపోయారు. అయితే ఇప్పుడు జగన్ చేసిన ఈ ఒక్క పని వల్ల రానున్న స్థానిక ఎన్నికల్లో వైసీపీదే విజయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
కల నెరవేర్చుకున్న జగన్
జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని తలపెట్టారు. నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి తర్వాత పక్కా ఇంటిని నిర్మించాలని జగన్ భావించారు. అయితే ఈ నిర్ణయం పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే ఉంది. ఇప్పుడు పక్కా అన్ని సిద్ధం చేసుకొని నేటి నుండి ఈ పంపిణీ కార్యక్రమం జగన్ చేపట్టనున్నారు. దాదాపు 35 లక్షల మంది వరకూ లబ్దిదారులు ఉన్నట్లు గుర్తించారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో పాటు లక్షల మందికి అవసరమైన ఇళ్ల స్థలాలను కూడా సేకరించారు. అనేక చోట్ల ప్రయివేటు భూములను సేకరించారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేని చోట ప్రయివేటు భూములను ప్రభుత్వం కొనుగోలు చేసింది.
స్థానిక ఎన్నికల్లో వైసీపీదేనా విజయం
మొన్నటి వరకు సీఎం జగన్ రెడ్డి తీసుకున్న అన్ని నిర్ణయాలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయని, కరోనాను కట్టడి చెయ్యడంలో సీఎం విఫలమైందని టీడీపీ నాయకులు చెప్తూనే ఉన్నారు. ఈ ధీమాతోనే స్థానిక ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఇళ్ల పంపిణీ కార్యక్రమంతో స్థానిక ఎన్నికల్లో విజయానికి జగన్ రూట్ క్లియర్ చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.