అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాల గురించి చెప్పాల్సిన పనిలేదు. అక్కడ రాజకీయానికి ఫ్యాక్షన్ ఎప్పటికప్పుడు పురుడు పొస్తుంటుంది. ఆధిపత్య పోరులో నిత్యం వివాదాలతో ఆ జిల్లా అట్టుడుకుతూనే ఉంటుంది. అధికార పక్షం-ప్రతిపక్షం మధ్య వివాదాలు ఎప్పుడూ అంటగాగుతూనే ఉంటాయి. తాజాగా పేరూరు డ్యామ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దివంతగ మాజీ మంత్రి పరిటాల రవి పేరుతో వేసిన శిలా ఫలాకాలను దుండగలు రాత్రికి రాత్రే ధ్వంసం చేసారు. విషయం పరిటాల సునీత, కుమారుడు శ్రీరామ్ ల దృష్టికి వెళ్లడంతో సీన్ వేడెక్కింది. హుటా హుటిన సునీత , శ్రీరామ్ తన అనుచరులతో స్పాట్ కు చేరుకున్నారు.
జిల్లాకు టీడీపీ కేడర్ భారీగా తరలిరావడంతో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజక వర్గం పేరూరులో ఉద్రిక్తత వాతావరణ అలుముకుంది. శిలా ఫలకాలు శిథిలమవ్వడం చూసి టీడీపీ నేతలు, సునీత భగ్గుమన్నారు. క్షక్షపూరితంగానే గ్రామాల్లో ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారని సునీత ధ్వజమెత్తారు. రాప్తాడు నియోజక వర్గం అభివృద్దిని ఓర్వలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. గతంలో జరిగిన కొన్ని ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోలే దని..వాళ్ల అండ చూసుకునే వైకాపా అనుచర గణం రెచ్చిపోతుందని మండిపడ్డారు.
రాప్తాడు ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మద్దెల చెరువుసూరి తమ్ముడు గంగుల సుధీర్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నారని సునీత ఆరోపించారు. రాష్ర్టంలో ముఖ్యమంత్రి పాలన ఉందా? అని మండిపడ్డారు. వైకాపా ఇలాంటి వారిని ప్రోత్సహించడం రాష్ర్టానికి పట్టిన దౌర్భాగ్యం అంటూ నిప్పులు చెరిగారు. దీంతో వైకాపా నేతలు ప్రతి దాడికి దిగుతున్నారు. దీంతో రాప్తాడు లో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉండటంతో పోలీసులు పహారా ఏర్పాటు చేసారు.