సెటిలర్స్ కేసీఆర్ వలకు చిక్కుతారా..?

KCR wants to prove his power in GHMC elections

 GHMC ఎన్నికలను తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పార్టీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటాయి. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడేళ్లు సమయం ఉన్నకాని, గ్రేటర్ ఎన్నికలను అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు అంటూ ప్రచారం చేస్తారు. ఇందులో విజయం సాధించి మేయర్ పీఠం మీద ఎవరి జెండా ఎగురుతుందో, రాబోయే ఎన్నికల్లో దాదాపుగా వాళ్లే విజయం సాధిస్తారనే నమ్మకం ఎక్కువ.. అందుకే అన్ని పార్టీలు తమ సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేస్తాయి.

ghmc elections telugu rajyam

  గ్రేటర్ ఎన్నికలు అంటే ఒక రకంగా సెటిలర్స్ ఎన్నికలే అని చెప్పుకోవాలి. హైదరాబాద్ లో సగానికి పైగా సెటిలర్స్ ఓట్లు ఉన్నాయి, వాళ్ళని ప్రసన్నం చేసుకుంటే చాలు విజయం లభించినట్లే, ముఖ్యంగా ఆంధ్ర సెటిలర్స్ మద్దతు ఇందులో చాలా కీలకం, అందుకే తెరాస పార్టీ ఎక్కువగా సెటిలర్స్ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. నిజానికి ఆంధ్రోళ్ళను కేసీఆర్ తిట్టిన తిట్లు మరొకరు తిట్టలేదు. ద్రోహులు, అక్రమార్కులు, కబ్జాదారులు, ఆంధ్రోళ్ల వలనే తెలంగాణ యువత ఉద్యోగాలను పొందలేకపోతుంది. మన ఉపాధిని వాళ్లొచ్చి ఎగరేసుకొని పోతున్నారంటూ కేసీఆర్ మాట్లాడిన మాటలు అన్ని ఇన్ని కావు. అలాంటి కేసీఆర్ నోటి నుండే ఆంద్రోళ్ళు మా అతిధులు, వాళ్ళని మా కన్న బిడ్డలు మాదిరే చూసుకుంటామంటూ అనే మాటలు కూడా వచ్చాయి.

  సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలంటే ప్రాంతీయ బేధాలు రెచ్చకొట్టి,ఆంధ్రోళ్లు అంటూ వాళ్ళని తిట్టిపోసి, ఆ తర్వాత గ్రేటర్ ఎన్నికలు వస్తే ఆంద్రోళ్ళు మా బిడ్డలు అంటూ మాట్లాడటం ఒక్క కేసీఆర్ కు మాత్రమే చెల్లుతుంది. గతంలో ఇదే సూత్రం అమలుచేసి రెండు రకాల ఎన్నికల్లో విజయం సాధించాడు. అయితే కేసీఆర్ రెండు నాల్కల ధోరణిని గుర్తించలేని అమాయకులు కాదు తెలంగాణ ప్రజానీకం. కేసీఆర్ యొక్క పనితనం ఏమిటో, ఆయన అవసరాల కోసం ఎన్నెన్ని మాటలు మారుస్తాడో అందరికి అర్ధం అయ్యింది. అందుకే ఈ ఎన్నికల్లో కేసీఆర్ మాటలను నమ్మే స్థితిలో ఎవరు లేరు. అందుకే ఆంధ్ర సెటిలర్స్ ను మచ్చిక చేసుకొని వాళ్ళ మద్దతుతో గెలవాలని చూస్తున్నాడు కేసీఆర్.

cmkcr telugu rajyam

  అందులో భాగంగా ఆంధ్ర జనాలు ఎక్కువగా ఉంటే ప్రాంతాలను ఎంపిక చేసి, అభివృద్ధి పనులు అక్కడ ఎక్కువగా జరిగే విధంగా చూస్తున్నాడు. అయితే స్థానిక ఆంద్రోళ్ళు కూడా కేసీఆర్ మాటలను నమ్మటానికి సిద్ధంగా లేరు. ఎన్నికల సమయంలోనే ఆంధ్రావాళ్ళు నా బిడ్డలు అంటారు. ఆ తర్వాత ఆంధ్ర వాళ్ళను పట్టించుకున్న పాపాన పోవటంలేదు. పైగా నిన్నటి వరదల్లో హైదరాబాద్ యొక్క నిజస్వరూపం అందరికి తెలిసింది. కేసీఆర్ పైకి మాటలు చెప్పటమే తప్ప పనిచేసే రకం కాదనే అభిప్రాయం అందరిలో కలిగింది. ముఖ్యంగా ఆంధ్ర సెటిలర్స్ 90 % శాతం మంది ఉండేది హైదరాబాద్ లోనే, నిన్నటి వరదల్లో హైదరాబాద్ దుస్థితి చూశాక కేసీఆర్ పాలనపై చాలా మందికి అసంతృప్తి పెరిగిపోయింది. ఇవన్నీ ఖచ్చితంగా రేపటి ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి.