తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ రాజకీయ వ్యవహారాలు చాలా సున్నితంగా ఉంటాయి. రాష్ట్రం విడిపోయిన దగ్గర్నుండి ఇరు రాష్ట్రాలు ప్రతి అంశంలోనూ ఎవరికి వారు అన్నతే ఉన్నారు తప్ప ఎక్కడా పరస్పర సహకారం అనేదే లేదు. ఇరు రాష్ట్రాల ప్రజలూ అంతే. హైదరాబాద్ నగరాన్ని కోల్పోయామనే బాధలో ఏపీ వాసులు ఉండగా మళ్ళీ ఎక్కడా ఆంధ్రా పాలకులు తెలంగాణలో పాగా వేస్తారో అని నిఘా పెట్టుకుని కూర్చున్నారు తెలంగాణ ప్రజలు. ఇక ఇరు రాష్ట్రాల జల యుద్ధం సంగతి చెప్పాల్సిన పనే లేదు. స్వయంగా కేసీఆర్, జగన్ ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నా అది కుదరలేదు. చివరకు ఇరు రాష్ట్రాలు ఒకరి ప్రాజెక్టులను ఒకరు అక్రమం, అవినీతి అంటూ ఆరోపణలు గుప్పించుకున్నారు.
Will Sharmila blames YS Jagan for Telangana
బేసిన్ల విషయానికి వస్తే తెలంగాణలో ఉన్న ఏ పార్టీ అయినా సరే, వారి రాజకీయ ప్రయోజనాలు ఏవైనా సరే తెలంగాణ తరపునే నిలబడి మాట్లాడాలి. అది తెలంగాణ వాసుల కఠిన నిర్ణయం. ఆ నిర్ణయంతోనే జగన్, కేసీఆర్ సయోధ్య కలగానే మిగిలిపోయింది. తెలంగాణవాసుల అభీష్టాన్ని అర్థంచేసుకున్న కాంగ్రెస్, బీజేపీలు సైతం ఏపీలో పార్టీ ఏమవుతుందని భయాన్ని పక్కనపెట్టి జగన్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కొత్తగా పార్టీ పెడుతున్న షర్మిల సైతం ఆ పార్టీల మాదిరిగానే జగన్ మీద ముక్కుసూటి ధోరణితో వ్యవహరించగలరా లేదా అనేదే పెద్ద ప్రశ్న.
ప్రస్తుతానికి ఎన్నికల హడావుడిలో వెనుకబడింది కానీ రేపో మాపో నదీ జలాల వివాదం తెరపైకి రాక మానదు. అప్పుడు టిఆర్ఎస్ సహా అన్ని పార్టీలు జగన్ ప్రభుత్వాన్ని ముక్తకంఠంతో ధిక్కరిస్తాయి. అప్పుడు షర్మిల తెలంగాణవాసులు పక్షాన నిలబడి జగన్ చేస్తుంది తప్పని, ఏపీ ప్రభుత్వం నిర్ణయం సరైంది కాదని, వారి మూలంగా తెలంగాణ జిల్ల్లు ఎండిపోతాయని అనగలరా. షర్మిల రాయలసీమ బిడ్డే. ఆ రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లే ఎత్తిపోతల పథకం విషయంలోనే రగడ మొదలైంది. మరి షర్మిల తన సొంత ప్రాంతం ప్రయోజనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రయోజనాలను సమర్థించగలరా, రాయలసీమ జిల్లాల్లను సస్యశ్యామలం చేద్దామనుకుంటున్న జగన్ నిర్ణయాన్ని తప్పని అనగలరా లేకపోతే అన్న కదా అని మౌనం వహిస్తారా అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి జనంలో.