జ్వ‌రాలొచ్చిన‌ప్పుడే రాముల‌మ్మ క‌నిపిస్తారా?

తెలంగాణ రాష్ర్టంలో కరోనా వ్యాప్తి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌త్య‌క్షంగా ప్ర‌జ‌లు..టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం చూస్తున్న‌దే. క‌ట్టడి…రోగుల‌కు అందించే చికిత్స విష‌యంలో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ యంత్రాగం హైకోర్టుతో అక్షింత‌లు వేయించుకుంది. ప్ర‌భుత్వ‌ విధానంపై ప్ర‌తిప‌క్ష పార్టీ కాంగ్రెస్ స‌హా బీజేపీ పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డాయి. క‌రోనా పేరుతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలో ఆ రాష్ర్టంలో బాగా ఫోక‌సింగ్ లోకి వ‌చ్చాయి. ఉత్త‌మ‌కుమార్ రెడ్డి, కొమ‌ట‌రెడ్డి, రేవంత్ రెడ్డి లాంటి వారు పార్టీ ద్వారా ప్ర‌జ‌ల‌కు ఇంకా ద‌గ్గ‌ర‌య్యారు. బీజేపీ ప‌క్షాన ఆ పార్టీ రాష్ర్ట అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పేరు కూడా తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఇప్పుడు బాగా నానుతోంది. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ ప‌నితీరును, ఆ పార్టీ నేత‌ల్ని బ‌లంగా విమ‌ర్శించ‌గ‌ల‌ర‌ని ఓ నమ్మ‌కాన్ని బ‌ల‌ప‌రుచుకున్నారు.

ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డి పోరాటం చేస్తున్నారు. ప్ర‌భుత్వం అందిస్తోన్న వైద్యం ద‌గ్గ‌ర నుంచి నిన్న‌టి ఉస్మానియాలో వ‌ర‌ద నీరు పార‌డం వ‌ర‌కూ అధికార ప‌క్షంతో గట్టిగానే పోరాటం చేసారు. అయితే కాంగ్రెస్ నాయ‌కురాలు, సినీ న‌టి విజ‌య‌శాంతి మాత్రం పార్టీలో ఏదో మొక్కుబ‌డిగానే కొన‌సాగుతున్న‌ట్లు మ‌రోసారి రుజువైంది. గ‌త ఏడాది తెలంగాణ‌ని విష జ్వ‌రాలు వెంటాడిన‌ప్పుడు మాట్లాడిన రాముల‌మ్మ మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు లైన్ లోకి వ‌చ్చారు. రాష్ర్టానికి కోరోనా వ‌చ్చి మూడు నెల‌లు పూర్త‌యినా ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌ని విజ‌య‌శాంతి తాజాగా ఫేస్ బుక్ వేదిక‌గా నిప్పులు చెర‌గ‌డం విశేషం.

రాముల‌మ్మ ఎఫ్ బీ ఖాతా వేదిక‌గా త‌న‌దైన శైలిలో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వంపై క‌రోనా ప‌రిస్థితుల‌ను ఉద్దేశించి ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌భుత్వాని కి హైకోర్టు ఎన్ని అక్షింత‌లు వేసినా క‌నీసం చీమ కుట్టిన‌ట్లు కూడా లేద‌ని, ఇలాంటి ప్ర‌భుత్వాలు ఉన్నా? లేక‌పోయినా? ఒక‌టేన‌ని దుయ్య‌బెట్టారు. ఇలా త‌న‌దైన శైలిలో విజ‌య‌శాంతి త‌న బాణీని వినిపించారు. కానీ నెటి జ‌నులు రాముల‌మ్మ‌పై కాస్త అసంతృప్తిని వ్య‌క్తం చేసారు. ప్ర‌జ‌లు తరుపున ప్ర‌తిప‌క్ష నేత‌లు ఎప్పుడూ ప్ర‌భుత్వం తో పోరాటం చేయాల‌ని…ఇలా గుర్తొచ్చిన‌ప్పుడే…జ్వ‌రాలొచ్చిన‌ప్పుడో స్పందించ‌డం స‌రి కాద‌ని..అధికారంలో ఉన్నా? లేక‌పోయినా? రాజ‌కీయ నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు ఎప్పుడూ అందుబాటులో ఉండాల‌ని చుర‌క‌లు అంటించారు.