అన్న నందమూరి తారక రామారావు కూతురిగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పురందేశ్వరీ తెచ్చుకున్నారు. టీడీపీలో చంద్రబాబు ఆధీనంలో ఉండటం నచ్చని పురందేశ్వరీ మొదటి నుండి బీజేపీలో ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆమెను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ బీజేపీ అధిష్టానం తీసుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్రంలో దీన స్థితిలో ఉన్న టీడీపీ నాయకులు తమ పార్టీని కాపాడే దేవతగా పురందేశ్వరీని చూస్తున్నారు.
టీడీపీని కాపాడుతుందా!
పురందేశ్వరీ బీజేపీలో క్రియాశీలంగా ఉండడంతో ఏపీలో బీజేపీతో కొత్త పొత్తుల ఆశలు పసుపు పార్టీలో మొలకెత్తుతున్నాయట. ఇవాళ కాకపోయినా ఎన్నికల నాటికి అయినా ఏదోఒకలా ఈ రెండు పార్టీలు కలిసేలా పురంధేశ్వరి చొరవ తీసుకుంటారని అంటున్నారు. ఎంత అయినా తండ్రి పెట్టిన పార్టీ టీడీపీ మీద చిన్నమ్మకు ప్రేమ ఉండడం సహజం. ఇక 2024 ఎన్నికల్లో బీజేపీ అండ లేకపోతే టీడీపీ కుప్పకూలడం ఖాయం. దాంతో పురంధేశ్వరి కచ్చితంగా మేలు చేసే పనే చేస్తారని అంటున్నారు.
లోకేష్ పై ప్రేమ చూపిస్తుందా!
రానున్న రోజుల్లో టీడీపీని లోకేష్ చేతిలో పెట్టి, లోకేష్ ను రాష్ట్ర సీఎంగా చెయ్యడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు. అయితే పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అదిసాధ్యమయ్యే విషయం కాదు. పొత్తులు పెట్టుకోకుండా ఇప్పటి వరకు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు పురందేశ్వరీ బీజేపీలో కీలక స్థానంలో ఉండటంతో టీడీపీని ఆదుకొంటుందని, లోకేష్ పై పురందేశ్వరీకి చాలా ప్రేమ ఉందని, ఆ ప్రేమకోసమైనా టీడీపీని రానున్న రోజుల్లో పురందేశ్వరీ కాపాడుతుందని టీడీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.