టీఆర్‌పీ రేట్ల విషయంలో మిగిలిన ఛానెల్స్‌తో పోల్చితే బుల్లితెర జెమినీ ఛానెల్ చాలా వెనకబడి ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ విషయంలో జెమినీ వారు దూకుడు ప్రదర్శించి, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ అనే ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. తద్వారా తమ ఛానెల్ టీఆర్‌పీ రేట్లు పెరుగుతాయని భావించారు.
ఎన్టీఆర్ హోస్టింగ్‌లో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో స్టార్ట్ అయ్యింది. తొలి సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ తనదైన మ్యానరిజమ్‌తో తనకున్న క్రేజ్ అంతటినీ ఉపయోగించి ఈ షోని నడిపించారు. రామ్ చరణ్, సమంత, రాజమౌళి తదితర స్టార్ సెలబ్రిటీలను సైతం తీసుకొచ్చి హైప్ క్రియేట్ చేశాడు. కానీ, ఏం లాభం.? రావల్సిన టీఆర్‌పీ రేటింగ్స్ పట్టడంలో జెమీనీ ఛానెల్ టార్గెట్ రీచ్ అవ్వలేకపోయింది.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు థమన్, దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ షోకి గెస్ట్‌లుగా విచ్చేశారు. అయినా ఈ షో పుంజుకోలేకపోయింది. సివరాఖరికి షో సీజనే ముగిసిపోయింది. ఇక తదుపరి సీజన్ కోసం కూడా ఎన్టీఆర్‌నే హోస్ట్‌గా అడుగుతున్నారట మేకర్లు. అయితే, ఈ షో వల్ల ఎన్టీఆర్‌కీ టైమ్ వేస్ట్ తప్ప ప్రత్యేకంగా కలిసొచ్చిందేమీ లేదు. దాంతో సెకండ్ సీజన్ హోస్ట్‌గా ఎన్టీఆర్ నో అనేశాడని ప్రచారం జరుగుతోంది.
మరి, ఈ ప్రచారంలో నిజమెంతో కానీ, ఎన్టీఆర్ లాంటి స్టార్ ఇమేజ్‌ని సైతం జెమినీ ఛానెల్ క్యాష్ చేసుకోలేకపోయిందంటే, లోపం ఎక్కడుందో. అలాగే, ఎన్టీఆర్‌తోనే ఈ షోకి క్రేజ్ రాలేదంటే, మరింకెవ్వరి వల్లయినా అవుతుందా.? అసాధ్యమేనేమో.