Mahesh Supprt YSRCP : సినిమాల్నీ, రాజకీయాల్నీ కలగలిపేయడం అనేది కొత్త విషయం కాదు. సూపర్ స్టార్ కృష్ణ ఒకప్పుడు కాంగ్రెస్ మనిషి. అలా కాంగ్రెస్ పార్టీకి చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి పట్ల ఆయనకు అమితమైన మమకారం వుండేది. మరి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల కృష్ణ, ఆయన తనయుడు నయా సూపర్ స్టార్ మహేష్‌బాబుకి వున్న అభిప్రాయమేంటి.?
మహేష్ అభిప్రాయమెలా వున్నా, మహేస్ అభిమానులైతే వైసీపీకి కనెక్ట్ అయిపోయారు. ‘సర్కారు వారి పాట’ సినిమా బాధ్యతని పూర్తిగా వైసీపీ మద్దతుదారులు తమ భుజానికెత్తుకోవడమే ఇందుకు కారణం. తెలంగాణలో వైసీపీ లేకపోయినా, వైఎస్ జగన్ అభిమానులున్నారు. వాళ్ళంతా ‘సర్కారు వారి పాట’ సినిమాకి అండగా నిలిచారు.
టీడీపీ, జనసేన కలిసి మహేష్ సినిమా మీద కుట్ర పన్నాయన్నది వైసీపీ ఆరోపణ. చిత్రమేంంటంటే, ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదలవగానే, అందులోని ‘గ్లాస్’ సీన్‌కి రాజకీయ రంగు పులిమి, జనసేన మద్దతుదారులైన పవన్ అభిమానుల్ని, ‘సర్కారు వారి పాట’ సినిమాకి వ్యతిరేకంగా ఉసిగొల్పింది వైసీపీ శ్రేణులే.
పవన్ – మహేష్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో ‘అర్జున్’ సినిమా పైరసీ బారిన పడితే, పరిశ్రమలో మహేష్‌కి అండగా నిలిచింది పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆ స్నేహం కాస్తా, ఇప్పుడీ ‘సర్కారు వారి పాట’ సినిమాతో చెడిపోయిందన్న భావన ‘సోషల్ పైత్యం’ వల్ల కలిగింది.
మరిప్పుడు పవన్‌కి వ్యతిరేకంగా మహేష్, జగన్‌తో చేతులు కలుపుతారా.? అంటే, సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. మహేష్ ఎవరికీ మద్దతుగాగానీ, ఎవరికీ వ్యతిరేకంగాగానీ వ్యవహరించే అవకాశమే లేదు.