మాజీ ప్రధాని మన్మోహన్‌కి విజయసాయిరెడ్డి బర్త్ డే విషెస్ వెనుక.!

vijaysai reddy

కాంగ్రెస్ నేత, మాజీ ప్రధాన మంత్రి, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్‌కి వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో తప్పేముంది.? తప్పేమీ లేదు. ఆర్థిక రంగంపై అపారమైన అనుభవం వుంది మన్మోహన్ సింగ్‌కి. విజయసాయిరెడ్డి కూడా ఆర్థిక వ్యవహారాల నిపుణుడే.!

అంతేనా.? ఇంకేమన్నా సీక్రెట్ యాంగిల్ ఇందులో వుందా.? సీక్రెట్ యాంగిల్ అనలేంగానీ, చాలామందికి చాలా డౌటానుమానాలు వస్తున్నాయ్ విజయసాయిరెడ్డి వ్యవహారశైలి మీద. ఎందుకంటే, మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా వున్నప్పుడే వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా విజయసాయిరెడ్డి అరెస్టయ్యారు.

‘కాంగ్రెస్ ప్రభుత్వం మామీద కుట్ర పన్నింది..’ అంటూ వైఎస్ కుటుంబం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపింది మన్మోహన్ సింగ్. కాంగ్రెస్ పార్టీలోనూ మన్మోహన్ సింగ్ కీలక నేత. అలాంటప్పుడు, ఆ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి విజయసాయిరెడ్డి ఎలా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు.?

రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. చంద్రబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షల్ని వైఎస్ జగన్ చెప్పడం.. వైఎస్ జగన్ పుట్టినరోజునాడు చంద్రబాబు విషెస్ అందించడం మామూలే. పార్టీ అధినేతల స్థాయిలో అలాంటి సఖ్యతలు తప్పవు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. కానీ, ఇది వేరే వ్యవహారం.. మన్మోహన్ సింగ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షల్ని విజయసాయిరెడ్డి తెలపడం.. అన్నది వైఎస్సార్సీపీ అభిమానుల వాదన.

జస్ట్ ఫర్ కర్టసీ.. అంతేనా.? అంతకు మించి తెరవెనుకాల విజయసాయిరెడ్డి నడుపుతోన్న రాజకీయ మంత్రాంగం ఇంకేదైనా వుండి వుంండొచ్చా.?