Sai Dharam Tej : సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ ఇప్పుడెలా వున్నాడు.? అన్న ప్రశ్నకు ఇంకా సరైన సమాధానమైతే దొరకడంలేదు. మెగా ఫ్యామిలీ పార్టీల్లో ఆయన పాల్గొంటున్నాడు. ఈ మేరకు అడపా దడపా ఫొటోలు బయటకు వస్తున్నాయి. అంతే తప్ప, ఆయన ఇంతవరకు బయటకు వచ్చింది లేదు.
కొన్నాళ్ళ క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్, కొన్నాళ్ళపాటు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. అయితే, పూర్తిస్థాయిలో సాయి ధరమ్ తేజ్ కోలుకున్నాడా.? లేదా.? అన్నదానిపై స్పష్టత లేదు. ఇటీవల మెగా కాంపౌండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నాడు. ఫొటోల్లో అయితే, పూర్తి ఫిట్‌గా కనిపిస్తున్నాడు.
ఆల్ ఈజ్ వెల్ అయితే, సాయి ధరమ్ తేజ్ పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చేవాడననీ, ఇంకా ఏదో సమస్య వుండబట్టే ఆయన బయటకు రావడంలేదనీ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వ్యక్తమయ్యే అనుమానాల గురించి కొత్తగా చెప్పుకునేదేముంది.?
నిజానికి, ఇలాంటి విషయాల్ని ఎక్కువ రోజులు సీక్రెట్‌గా వుంచడం కూడా కష్టమే. కానీ, సాయి ధరమ్ తేజ్ విషయంలో సస్పెన్స్ చాన్నాళ్ళుగా కొనసాగుతూనే వుంది. లేనిపోని అనుమానాలకు తావివ్వకుండా సాయి ధరమ్ తేజ్ పబ్లిక్ అప్పీయరెన్స్ ఇచ్చేస్తేనే మంచిది.
కానీ, రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత సాయి ధరమ్ తేజ్ ఎలా వున్నాడు.? మీడియాని ఫేస్ చేయాలంటే చాలా విషయాలు చర్చకు వస్తాయి గనుక, సైలెంట్గా వుంటున్నాడా.? ఏమోగానీ, రోడ్డు ప్రమాదం విషయమై పోలీసులు ఆయనకు నోటీసు పంపారట.. దానికి ఆయన ఇంకా సమాధానం చెప్పలేదట.