పయ్యావుల కేశవ్ ఎక్కడున్నావయ్యా? చంద్రబాబుకు కాస్త అండగా ఉండవయ్యా..!

why tdp mla payyavula keshav neglecting chandrababu?

పయ్యావుల కేశవ్.. ఈ పేరు తెలుగు ప్రజలకు సుపరిచితమే. రాజకీయ రంగంలో ఈ పేరు బాగానే పాపులర్. కానీ.. అది ఒకప్పుడు. ఇప్పుడు కాదు. పయ్యావుల పేరు ఇప్పుడు అసలు వినపడటమే లేదు. ఒకప్పుడు పయ్యావుల మైకు ముందుకు వస్తే.. అంతే ప్రతిపక్షాలు హడలిపోవాల్సిందే. కానీ.. ఇప్పుడు ఏమైంది? పయ్యావుల అసలు ఎక్కడ ఉన్నాడు?

TDP mla Payyavula keshav is absconding
TDP mla Payyavula keshav is absconding

పయ్యావుల ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే. కానీ.. తన పార్టీ మాత్రం ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. 2014లో పయ్యావుల కేశవ్.. ఓడిపోయారు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. కానీ ఏం లాభం. అప్పుడు చంద్రబాబు పయ్యావుల ఓడిపోయాడని పట్టించుకోలేదు. పయ్యావులకు ఉన్న రాజకీయ అనుభవంతో ఎమ్మెల్సీని చేసిన మంత్రిని కూడా చేయొచ్చు. కానీ.. చంద్రబాబు పయ్యావులను పక్కన పెట్టాడు.

దీంతో.. పయ్యావుల కూడా అప్పట్లో సైలెంట్ అయిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు 2019లో పయ్యావుల ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ.. టీడీపీ ప్రతిపక్షంలోకి వెళ్లిపోయింది. నిజానికి పయ్యావుల టీడీపీ మీద ఈగ కూడా వాలనీయకుండా ప్రతిపక్షాలకు గట్టిగా బదులు చెప్పగల మాటకారి.

ప్రస్తుతం చంద్రబాబుకు కావాల్సింది కూడా పయ్యావుల లాంటి వాళ్లే. పయ్యావుల లాంటి వాళ్లు పక్కన లేకనే చంద్రబాబు పరిస్థితి రోజురోజుకూ ఘోరంగా అవుతోంది. ఎమ్మెల్యే అయినా కూడా పయ్యావుల సైలెంట్ అయిపోయాడు. చంద్రబాబుతో అంటీముట్టనట్టుగానే ఉన్నట్టు తెలుస్తోంది.

చంద్రబాబు అప్పుడు పయ్యావులను పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు పయ్యావుల చంద్రబాబు ను పట్టించుకోవడం లేదు. ఇది నూటికి నూరు శాతం చంద్రబాబు తప్పిదమే అంటూ రాజకీయ వర్గాల చర్చ నడుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే అయినప్పటికీ.. పయ్యావుల కనీసం ఎక్కడా కనిపించడం కూడా లేదు. ఎక్కడున్నాడో? ఏం చేస్తున్నాడో? ఎవ్వరికీ తెలియదు. కనీసం తన నియోజకవర్గ ప్రజలకు అయినా అందుబాటులో ఉంటున్నాడా? అంటే దానిపై కూడా స్పష్టత లేదు.

పయ్యావుల కేశవ్ నువ్వు ఎక్కడున్నావయ్యా? నువ్వయినా ఒక మెట్టు కిందికి దిగి.. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు కు అండగా ఉండు. ఏమో.. మళ్లీ బండ్లు ఓడలు కావచ్చు కదా. వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఒకవేళ పుసుక్కున టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎట్లా? అందుకే.. చంద్రబాబుకు కాస్త అండగా ఉంటే నీకే మంచిది.. అంటూ టీడీపీ తమ్ముళ్లు కూడా అనుకుంటున్నట్టు తెలుస్తోంది.