మౌనవ్రతం చేస్తున్న టీడీపీ ఫైర్ బ్రాండ్స్

tdp telugu rajyam

 రాజకీయ పార్టీలో ఎంత మంది లీడర్స్ ఉన్నకాని, అందులో ఫైర్ బాండ్శ్ కి ఉండే క్రేజ్ వేరు. ఆయా నేతలు మైక్ ముందుకి వస్తే చాలు రెండుమూడు రోజులు వాళ్లే అన్ని రకాల మీడియాలో కనిపిస్తారు. సాధారణ ప్రజల దగ్గర నుండి రాజకీయ విశ్లేషకులు దాక వాళ్ళ మాటలను వినటానికి ఇష్టపడుతారు. అలాంటి వాళ్ళు ఏపీ రాజకీయాల్లో బాగానే కనిపిస్తారు. అధికార వైసీపీలో కొడాలినాని, అంబటి రాంబాబు, రోజా, అనిల్ కుమార్ యాదవ్ , చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వంగ గీత, ఆమంచి కృష్ణ మోహన్ లాంటి వాళ్ళు ఉన్నారు.

tdp ycp telugu rajyam

 

 టీడీపీలో కూడా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, దేవినేని ఉమా, అయ్యన్న పాత్రుడు,వెలగపూడి రామకృష్ణ,పయ్యావుల కేశవ్, అనురాధ, సబ్బం హరి, బోండా ఉమా, బోడే ప్రసాద్,కేశినేని, బీటెక్ రవి, బుద్ధా వెంకన్న ఇలా చాలా మందే టీడీపీలో ఉన్నారు.. అధికార పక్షములో ఉన్న ఫైర్ బ్రాండ్స్ కు పని తక్కువే ఉంటుంది. ప్రతిపక్షలు ఏమైనా విమర్శలు చేస్తే వాటిని తిప్పికొట్టటమే వాళ్ళ పని, ప్రతిపక్షాలు సైలెంట్ అయితే వీళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు, కానీ టీడీపీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి అలా కాదు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి, అవకాశం లేకపోయినా కానీ కల్పించుకొని మరి తమదైన శైలిలో విమర్శలు చేయటం, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో, అభివృద్ధి పనుల్లో లొసుగులను కనిపెట్టి, ప్రభుత్వ పనితీరును ఎండగట్టటం లాంటివి చేస్తుండాలి. ప్రతిసారి రాష్ట్రంలో ప్రతిపక్షము ఉందనే విషయం ప్రజల మర్చిపోకుండా చేయాల్సిన బాధ్యత ఇలాంటి ఫైర్ బ్రాండ్స్ మీద ఉంటుంది.

 టీడీపీలో ఎందుకో ఈ మధ్య కాలంలో ఫైర్ బ్రాండ్స్ పెద్దగా బయటకు రావటం లేదు. సరిగ్గా ఒక మూడు నాలుగు వారాల నుండి ఎక్కడ కూడా టీడీపీ నేతలు పెద్దగా మాట్లాడిన దాఖలాలు కనిపించటం లేదు. అయితే ఇదేమైనా వ్యూహంలో భాగమా..? లేక మరేదైనా జరిగిందా అనేది బయటకు తెలియటం లేదు. కాకపోతే టీడీపీ సన్నిహిత వర్గాల నుండి మాత్రం ఒక వార్త వినిపిస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులను నియమించటం జరిగింది. ఆయా అధ్యక్షులను సమన్వయం చేయటానికి ఇంచార్జిలను నియమించాడు బాబు. అయితే ఈ నియామకాల్లో టీడీపీ ఫైర్ బ్రాండ్స్ ను పట్టించుకోలేదని తెలుస్తుంది.

 పార్టీలో కీలకంగా ఉండే నేతలకు పెద్దగా ఆ పదవులు రాలేదని సమాచారం. దీనితో పార్టీలో అగ్రశ్రేణి నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. పార్టీ కోసం కష్టపడే మాకు పదవులు ఇవ్వకుండా మరొకరికి ఇవ్వటమేంటి అనే అసంతృప్తి ఆయా నేతల్లో ఉన్నట్లు తెలుస్తుంది. దానికి తోడు ఈ నియామకాలు జరిగిన తర్వాత అధినేత చంద్రబాబు పదవులు రాని నేతలతో కనీసం మాట్లాడలేదని సమాచారం. దీనితో పుండు మీద కారం చల్లినట్లు అయ్యింది వాళ్ళ పరిస్థితి. అయితే ఈ విషయంలో అధినేత నుండి సృష్టమైన వివరణ వచ్చేదాకా పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటే మంచిదనే నిర్ణయానికి టీడీపీ లోకి ఫైర్ బ్రాండ్స్, సీనియర్ నేతలు అనుకున్నట్లు తెలుస్తుంది. అందుకే టీడీపీ ఫైర్ బ్రాండ్స్ హవా ఈ మధ్య తగ్గింది కాబోలు.