రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం టీడీపీ, వైసీపీ నాయకులకు లేదా!!

ఏపీలో ఇప్పుడున్న రాజకీయ నాయకులకు ప్రజల ప్రయోజనాల కంటే కూడా పార్టీ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఏపీలో ఉన్న టీడీపీ, వైసీపీ నాయకులు ఇద్దరు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సహవాసం కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నప్పటికీ స్నేహం కోసం ఎదురు చూస్తున్న ఈ నాయకులు ఇప్పుడు బీజేపీ ప్రశ్నించడానికి భయపడుతున్నారు. అయితే ఇప్పుడు పార్లమెంట్ లో మాత్రం కేంద్రాన్ని రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తామని ఈ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.

YSRCP MLA unable stop TDP  

ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతామని ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అటు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చాలా ధీమాగా చెప్పేస్తున్నాయ్. ఓసోస్గ తంలో భలేగా కేంద్రాన్ని నిలదీసేశారు,ఇప్పుడు మళ్ళీ ప్రశ్నించేస్తారు అంటూ టీడీపీ, వైసీపీల మీద సాధారణ ప్రజానీకం సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేసేస్తున్నారు. అలాగే టీడీపీ నాయకులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయలపై కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని టీడీపీ నాయకులు చెప్తున్నారు.

ప్రత్యేక హోదా అనే అంశంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు ఇప్పుడు ఆ అంశాన్ని మర్చిపోయారు. టీడీపీ నాయకులు కూడా వైసీపీని తిట్టేపనిలో పడి ప్రత్యేక హోదాను మర్చిపోయింది. అలాగే పోలవరం విషయంలోనూ రాష్ట్ర నాయకులు కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారు. రెండు పార్టీలూ గల్లీలో పులి, ఢిల్లీకి వెళితే పిల్లి అన్నట్టు వ్యవహరిస్తాయి.