ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఎందుకు దూరంగా ఉన్నారు ?

Why Sridevi did not attend the assembly meetings?

ఆంధ్ర ప్రదేశ్ : ఎమ్మెల్యే అయినప్పటి నుండి తరుచూ వివాదాలలో ఉంటున్న తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇప్పుడు మరొకసారి చర్చల్లోకి వస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆమె కనిపించకపోయేసరికి ఆమె రాలేదా లేక రావొద్దన్నారా అని ఆరా తీస్తున్నారట. ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ గుంటూరు జిల్లా తాడికొండ పరిధిలోనే ఉంటుంది.సొంత నియోజక వర్గంలో శాశనసభా సమావేశాలు ఉన్నప్పుడు శ్రీదేవి తప్పకుండా హాజరవటం జరుగుతుంది, అరుదుగా ఆమే రాకపోటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ రీసెంట్ గా ఐదు రోజుల పాటు జరిగిన శీతాకాలం అసెంబ్లీ సమావేశాలలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి హాజరుకాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది .ఆమె రాకపోవటానికి కారణం బయటకి తెలియకపోవడంతో ఏదైనా సొంత కారణాలతో ఆమెనే రాలేదా లేక పార్టీ హైకమాండ్ రావొద్దన్నారా అని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారట.

 

ఇటీవల బయటకొచ్చిన కొన్ని హాట్ టాపిక్ విషయాలలో ఎమ్మెల్యే శ్రీదేవి పాత్ర ఉందని మీడియాలో బాగా ప్రచారం జరిగింది. పేకాట క్లబ్ లు , అనుచరుల ఆరోపణలు మరియు ఎంపీ నందిగామ సురేష్ తో శ్రీదేవి కి ఉన్న గొడవలు ఆ మధ్య ఓ రేంజ్ లో వేడి పుట్టించాయి. పార్టీ పెద్దలు ఎంత వారించినా వివాదాలు సద్దుమణగకపోవటంతో వారు కూడా ఒకింత అసహనానికి గురైనట్లు తెలిసింది. నందిగామ సురేష్ తో వివాదం కొలిక్కి వచ్చినా పేకాట క్లబ్ ల విషయంలో మాత్రం ఆమెని వివాదాలు వదలటంలేదు. ఎమ్మెల్యే తన అనుచరులతో పేకాట క్లబ్స్ నిర్వహించటం , పార్టీ లోని ఒక సామాజిక వర్గం నేతల గురించి వివాదాస్పద రీతిలో మాట్లాడినట్లుగా అనిపించే ఆడియో టేప్ లు బయటపడి సంచలనంగా మారాయి .

ఎమ్మెల్యే వీటన్నిటిని ఖండించినప్పటికీ పార్టీ పెద్దలు మాత్రం ఆమె మీద గుర్రుగానే ఉన్నారట. వాటి గురించి ఆమె ఎంత వివరణ ఇచ్చినప్పటికీ పెద్దలు మాత్రం సంతృప్తి చెందలేదట , వివాదాలకు దూరంగా ఉండమని ఎన్ని సార్లు చెప్పినా ఆమె వినకపోయేసరికి
అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు రావొద్దని పార్టీ హైకమాండ్ నుండి పరోక్షంగా ఆదేశాలు జారీ చేశారట. ఆమె సమావేశాలకి వస్తే మీడియా ముందు గాని లేదా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల నుండి ప్రశ్నలు ఎదురైతే ఇబ్బందికర పరిస్థితులు రావొచ్చని కనుక ఇవేమి జరగకుండా ఉండాలంటే సమావేశాలకు రాకుండా ఉండటమే చాలా మంచిదని ఆమెని దూరం పెట్టారని సమాచారం. సమావేశాలు అయిపోయిన తర్వాత కూడా ఆమె ఎందుకు రాలేదో అని సహచర ఎమ్మెల్యేల దగ్గర నుండి సామాన్య ప్రజల మధ్య కూడా చర్చ ఆగలేదట.