రజినీకాంత్‌ను తిడితే ఏం వస్తుంది ?

Why someone scolding Rajnikanth
Why someone scolding Rajnikanth
సూపర్ స్టార్ రజినీకాంత్ మీద ఇప్పటివరకు ఆయన సొంత విషయాల్లో అభ్యంతరాలు తెలిపిన వారు, విమర్శలు చేసిన వ్యక్తులు లేరు.  రజినీకాంత్ సైతం తన సొంత విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు.  వాటిని పెద్దగా బయటకు రానివ్వరు కూడ.  రజినీకాంత్ విషయంలో ఫ్యాన్స్ హార్ట్ అయిన విషయం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆయన పొలిటికల్ ఎంట్రీ విషయంలోనే.
 
చాలామంది రజినీని నిర్ణయం మార్చుకోమని గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. ఆ ఒక్క విషయం తప్ప వేరే ఏ విషయంలోనూ రజినీకాంత్ మీద నోరెత్తిన వారు లేరు.  కానీ ఇప్పుడు అదే జరుగుతోంది.  
 
రజినీకాంత్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.  వైద్య పరీక్షల నిమిత్తం ఆయన యూఎస్ వెళ్లారు. అక్కడి నుండి ఆయన తన స్నేహితుడు అయిన రచయిత వైరముత్తుతో ఫోన్లో మాట్లాడారట. వైరముత్తు ఈ విషయాన్ని చెప్పి రజినీకాంత్ చాలా ఆరోగ్యంగా ఉన్నారని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. అయితే ఇదే కొందరికి నచ్చలేదట. వైరముత్తు మీద మీటూ అలిగేషన్స్ ఉన్నాయి.  సింగర్ చిన్మయి ఆయన మీద ఆరోపణలు చేయడం జరిగింది. కానీ అవి నిజమా కాదా అనేది ఇంకా తేలలేదు. 
 
ఈ నేపథ్యంలో వైరముత్తుతో రజినీకాంత్ స్నేహం చేయడం బాగోలేదని కొందరు అంటున్నారు.  అనడమే కాదు విమర్శలు గుప్పిస్తున్నారు కూడ. రజినీకాంత్ వెంటనే వైరముత్తుతో స్నేహం మానుకోవాలని గట్టిగా చెబుతున్నారు.  ఇంకొందరు మాత్రం వైరముత్తు మీద ఆరోపణలకు రజినీకాంత్ ఏం చేయగలరు, ఆయన్ను తిడితే ఏం వస్తుంది, అయినా అలిగేషన్స్ నిజమని తేలలేదు కదా అంటున్నారు.