Shraddha Kappor : శ్రద్ధా కపూర్ అలా అనుకుంటే ఇలా చేసిందేంటబ్బా.!

Shraddha Kappor :  బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ పాత కథే రిపీట్ చేసిందనాలా.? లేక అంచనాల్ని రివర్స్ చేసిందనాలా.? నెట్టింట హాట్ హాట్‌గా ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ సోదిలో నిలిచింది. ఇంతకీ శ్రద్ధా కపూర్ ఏం చేసిందంటా.?

లవ్వు చేసింది. అదేనండీ. ప్రేమ. అదేం కొత్త విషయమా.? అనుకుంటున్నారా.? లవ్వు తర్వాత బ్రేకప్ అనేదొకటి వుంది కదా.. అందుకూ పెద్ద స్కెచ్ వేస్తోందట లేటెస్టుగా శ్రద్ధా కపూర్. అయ్యో అదేంటీ. రేపో మాపో తను కోరుకున్న ప్రియుడితో పెళ్లి పీటలెక్కబోతోందిగా శ్రద్ధా కపూర్.. ఇంతలో ఇదేం వింత డ్రామా.? అసలింతకీ శ్రద్ధా కపూర్ ఈ లవ్ అండ్ బ్రేకప్ కహానీ ఏంటనుకుంటున్నారా.?

గత నాలుగేళ్లుగా శ్రద్ధా కపూర్ సెలబ్రిటీ కమ్ ఫోటో గ్రాఫర్ రోహన్ శ్రేష్ట్‌తో లవ్ అండ్ రిలేషన్‌షిప్‌లో వుంది. అయితే, ఆ రిలేషన్‌షిప్‌ ఇప్పుడు బ్రేకప్ అయిపోయేలా వుందంటూ నెటిజనాలు తేల్చేస్తున్నారు. అందుకు కారణం ఈ మధ్య శ్రద్ధా కపూర్ బర్త్‌డే సందర్భంగా రోహన్ సందడి ఎక్కడా కనిపించలేదట మన నెటిజనాలకు.

దాంతో వీరిద్దరి లవ్ బ్రేకప్ అయిపోతోందంటూ ప్రచారం గుమ్మెత్తించేస్తున్నారు. ఎలాగైనా సరే, వీళ్లు విడిపోయేదాకా తగ్గేదే లే.. అంటూ నెట్టింట ఈ న్యూస్ వైరల్ చేసేశారు.

నిప్పు లేనిదే పొగ రాదనేవారు ఒకప్పుడు. కానీ, ఎలాగైనా సరే, పొగ పెట్టి మరీ నిప్పు పుట్టించేయాలని కంకణం కట్టుకోవడం నేటి ట్రెండ్. సర్లే ఒకసారి సరదాగా బ్రేకప్ చెప్పేసుకుందాం.. అంటూ వచ్చిన పొగకు ఆధ్యం పోస్తున్నారు మన సెలబ్రిటీలు. ఆ కోవలో లేట్ అయినా లేటెస్టుగా చేరిపోయింది అందాల భామ శ్రద్ధాకపూర్.