పోలవరానికి అన్యాయం జరుగుతున్నా కూడా పవన్ బీజేపీని వ్యతిరేకించడా!!

Following Pawan Kalyan is an useless thing 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన కొత్తలో రాష్ట్రంలో ఇక నుండి కొత్తతరమైన రాజకీయాలు చూస్తామని, అన్యాయం అక్రమాలకు లొంగకుండా ప్రజల కోసం నిలబడే పార్టీ ఒకటి వచ్చిందని ప్రజలు భావించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ నమ్మకాన్ని, ధైర్యాన్ని మెల్ల మెల్లగా చంపుకుంటూ వస్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన పోరాటాన్ని, ఆయన మాట్లాడిన విధానాన్ని ప్రజలు ఇంకా మర్చిపోవడం లేదు.కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ ప్రక్షాన చేరి ప్రజలకు దూరం అవుతున్నారు.

ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటున్న పవన్

2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపిన పవన్ ఆ తరువాత ఆ పార్టీ ప్రజల నమ్మకాన్ని నిలుపుకోలేపోయిందని ఆ పార్టీకి తన మద్దతును వెనక్కి తీసుకొని ప్రత్యేక హోదా కోసం పోరాడారు. ప్రత్యేక హోదా విషయంలో పవన్ ముందుండి పోరాడుతారని ప్రజలు అనుకున్నారు కానీ ఇప్పుడు బీజేపీతో చేరి ఆ నమ్మకాన్ని చంపేశారు. చివరికి విభజిత ఏపీకి ఇస్తామన్న పోలవరం ప్రాజెక్ట్‌కు బీజేపీ నాయకులు అడ్డుగోడేస్తున్నారు. దాన్ని శిధిలం చేయాలనుకుంటున్నారు. కానీ జనసేనాని నోరు మెదపలేకపోతున్నారు. అలాగే అమరావతి రైతులకు అండగా ఉంటానని పవన్ మాట ఇచ్చారు. తాము గెలిపించిన పార్టీలు తమకు మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు తమ్ పక్షాన పవన్ ఉన్నాడని, తమకు అన్యాయం జరగదని చాలామంది రైతులు నమ్మకం పెట్టుకున్నారు. అయితే వాళ్ళను నమ్మకాన్ని కూడా పవన్ గంగలో తొక్కారు. ఇలా బీజేపీతో జత కట్టి పవన్ మెల్లమెల్లగా ప్రజలకు దూరం అవుతూ, తనపై నమ్మకం పెట్టుకున్న ప్రజలను మోసం చేస్తున్నారు.

ఎందుకు బీజేపీకి భయపడుతున్నారు??

చంద్రబాబు నాయుడుకు రాజకీయంగా బీజేపీ అవసరం ఉంది కాబట్టి బాబు బీజేపీకి భయపడతారు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డికి కేసుల భయం ఉంది కాబట్టి బీజేపీకి తప్పకుండా భయపడాల్సిన పరిస్థితి కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి భయపడుతున్నాడో ఎవ్వరికి అర్ధం కావడం లేదు.