Invitation Cards: పెళ్లి పత్రికలకు పసుపు కుంకుమ ఎందుకు రాస్తారు… రాయడానికి గల కారణం ఏమిటి?

Invitation Cards: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యాలు జరిగినా లేదా పూజా కార్యక్రమాలు జరిగినా పసుపు కుంకుమలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తాము. ఇలా ప్రతి ఒక శుభకార్యంలో పసుపు కుంకుమలు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే వివాహ ఆహ్వాన పత్రికలకు కూడా పసుపు కుంకుమలు రాస్తారు.ఈ విధంగా పెళ్లి పత్రికలకు పసుపు కుంకుమ ఎందుకు రాస్తారు? రాయడానికి గల కారణాలు ఏమిటి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి జేష్టాదేవి అక్కచెల్లెళ్ళు. అయితే వీరిద్దరూ ఎక్కడ నివసించాలి అనే విషయం గురించి గొడవ పడతారు. ఇలా గొడవ పడుతున్న సమయంలో లక్ష్మీదేవి వెళ్లి సముద్రగర్భంలో దాక్కుంటుంది.సముద్రగర్భం నుంచి లక్ష్మీదేవి బయటకు రావాలని చెప్పిన జేష్టాదేవి అనంతరం తాను ఎక్కడ ఉండాలో కూడా తెలియజేసింది. ఈ క్రమంలోనే లక్ష్మీదేవి తాను పసుపు కుంకుమలలో కొలువై ఉంటానని తెలియజేస్తుంది.అందుకే పసుపు కుంకుమలను సాక్షాత్తూ లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తాము.

ఇలా ఎంతో పవిత్రమైన ఈ పసుపు కుంకుమలను వివాహ ఆహ్వాన పత్రికలకు రాయటం వల్ల స్వయంగా ఆ కార్యానికి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లని అర్థం.ఇలా పసుపుకుంకుమలు రాయటం వల్ల ఆ శుభ కార్యానికి లక్ష్మీదేవి ఆశీసులు ఉండటమే కాకుండా ఆ వధూవరులు కూడా ఎంతో సంతోషంగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే వివాహ ఆహ్వాన పత్రికలకు తప్పనిసరిగా పసుపు, కుంకుమను రాస్తారు.