Niharika Went To Pub : మెగా కుటుంబానికి చెందిన నిహారిక, పబ్బుకి వెళ్ళడం.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడం పెద్దయెత్తున చర్చనీయాంశమవుతోంది. నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ మరికొందరు ప్రముఖులు పబ్బుకి వెళ్ళారు.
ఆ సమయంలో ఆ పబ్బు మీద పోలీసులు రెయిడ్ చేశారు, అక్కడ డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లు గుర్తించి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే, ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు.? ఆ డ్రగ్స్ ఏంటి.? అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. అవన్నీ పక్కన పెడితే, ఉగాది పర్వదినాన నిహారిక ఎందుకు పబ్బుకి వెళ్ళింది.? అన్నది మరింత చర్చనీయాంశమవుతోంది.
‘ఈ ఘటనలో నా కుమార్తె నిహారిక తప్పేమీ లేదు’ అని నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు.
తప్పొప్పుల్ని తేల్చాల్సింది పోలీసులు, న్యాయ వ్యవస్థ. నాగబాబు తన కుమార్తె మీద ప్రేమతో ఈ వీడియో విడుదల చేశారా.? పోలీసుల నుంచి సమాచారం తీసుకుని ఇలా మాట్లాడారా.? అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది.
నిహారిక పబ్బుకి వెళ్ళడాన్ని తప్పు పట్టలేం. అది ఆమె వ్యక్తిగత విషయం. డ్రగ్స్ తీసుకుని వుంటే మాత్రం.. పోలీసులు ఆ దిశగా ఆమెపై చర్యలు తీసుకునే అవకాశముంది.
నిహారికకి పోలీసులు నోటీసులు ఇచ్చి పంపేశారన్న ప్రచారం జరుగుతోంది. సో, ముందు ముందు ఈ కేసులో వాస్తవాలు తెలుస్తాయేమో చూడాలి.
అయితే, సినీ పరిశ్రమకు సంబంధించి.. అలాగే హై ప్రొఫైల్ వ్యక్తులకు సంబంధించి డ్రగ్స్ కేసులు చాలా తేలిగ్గా నీరుగారిపోతాయ్. ఇక్కడ ఈ విషయంలోనూ చాలా పేర్లు వినిపిస్తున్న దరిమిలా, ీఈ కేసు ఏమవుతుందో ఏమో.!