పన్నెండేళ్లకు పైగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యమిచ్చినా గత కొన్నేళ్లుగా గ్లామర్ షో కాస్త తగ్గింఛి నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసుకుంటూ వెళుతోంది.
ఆమె సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నా పర్సనల్ లవ్ లైఫ్‌లో రెండుసార్లు ఫెయిల్ అయింది. ”నా మనసులోని భావాలను ప్రపంచానికి చెప్పడం ఇష్టం లేదు. నేను పూర్తిగా ప్రైవేట్ మనిషిని. అందుకే ఎక్కడా నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడను. కేవలం నేను నటించిన సినిమాల గురించే మాట్లాడతాను. గతంలో, నేను మీడియాతో మాట్లాడిన విషయాలను. చాలాసార్లు తప్పుగా ప్రచారంగా చేశారు” అని వాపోయింది ఇటీవల ఓ సందర్భంలో నయనతార. అందుకే ఇలాంటివి తనవల్ల కాదని, మీడియాకు దూరంగా ఉంటే.. లేనిపోని వివాదాలకు కూడా దూరంగా ఉండేందుకు వీలవుతుందని ఆమె చెప్పింది.
చీరకట్టులో సంప్రదాయబద్ధంగా కనిపించినా, బికినీలో అభిమానులకు కనువిందు చేసినా నయనతారకే చెల్లింది. మూడుపదుల వయస్సులో కూడా వన్నెతరగని అందంతో వెండితెర మీద దూసుకుపోతోంది. పాత్రలో పరకాయ ప్రవేశం చేసే అతి కొద్దిమంది హీరోయిన్లలో నయనతార ఒకరు. అయితే నయనతారకు అసలు సినిమాలంటే ఇష్టం లేదట. ఇష్టం లేకుండానే సినిమాల్లోకి వచ్చిందట.