Why Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబుపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఎందుకంటారా.? లేటెస్టుగా ‘సర్కారు వారి పాట’ సినిమా నుంచి ట్రైలర్ రిలీజయ్యింది. ట్రైలర్‌లో విజువల్స్ బాగున్నాయ్. హీరోయిన్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మహేష్ బాబు పవర్ ప్యాక్‌డ్ పర్ఫామెన్స్, టైమింగ్‌లో పంచ్ డైలాగులు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే అంతా బాగానే వుంది.
కానీ, తప్పెక్కడ జరిగింది.? డైలాగులు.. సూపర్ స్టార్ నోటి వెంట పేలుతున్న పంచ్ డైలాగుల్లో బూతుల వర్షం కురుస్తోంది. అదే కాస్త ఇబ్బందిగా వుంది ప్రేక్షకుడికి. సూపర్ స్టార్ అంతటోడి నోటి వెంట అంత దారుణమైన చీపు డైలాగులా.? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
మహేష్ బాబు సినిమా అంటే, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, అందులోనూ లేడీస్ ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతుంటారు. అలాంటిది, జుగుప్సాకరమైన బూతు డైలాగులు ఇష్టమొచ్చినట్లుగా చొప్పించేసిన ‘సర్కారు వారి పాట’ ట్రైలర్‌ని లేడీ ఆడియన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
మరీ కామెడీ కోసం స్టార్ హీరోలే ఇంత దిగజారిపోతారా.? అంటూ ఫ్యామిలీ లేడీస్ అవాక్కయిపోతున్నారు. మహేష్ అంటే ఓ వైబ్రేషన్.. మహేష్ అనే పేరులోనే ఓ పవరుంది.. అని మహేష్ బాబును పొగడ్తలతో ముంచేసే లేడీ ఫ్యాన్స్ ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ చూసి, సిగ్గుతో తల దించుకుంటున్నారట.
ఆ రేంజ్‌లో ట్రైలర్‌లో బూతు డైలాగులు ఇబ్బంది పెడుతున్నాయట మరి. ట్రైలరే ఇలా వుంటే, ఇక సినిమాలో బూతు పరిస్థితి ఏంటని వాపోతున్నారట.
క్లీన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న పరశురామ్ ఎందుకిలా చేశాడు.? ఆ బూతు డైలాగులు పలకడానికి మహేష్ ఎందుకు ఒప్పుకున్నాడు.? అంతా కామెడీ కోసమేనా.? ఏమో. సూపర్ స్టార్‌కే ఎరుక.!