గోరంట్ల ఈ వయస్సులో అత్యాశ ఎందుకయ్యా..?

gorantla buchaiah chowdary

 టీడీపీ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గత కొద్దీ రోజులుగా మీడియాలో నానుతున్నాడు , గతంలో ప్రత్యర్థి పార్టీల విషయంలో ఆరోపణలు చేస్తూ మీడియా దృష్టిని ఆకర్శించే ఆయన , ఈ మధ్య కాలంలో తనకు పదవులు కావాలని, తన బందువులకు పదవులు ఇప్పించాలని భావిస్తూ మీడియాలో హైలైట్ అవుతున్నాడు.

gorantla buchaiah chowdary

జీవితాశయం నెరవేరినట్లేనా

టీడీపీలో చంద్రబాబు స్థాయిలో అనుభవం కలిగిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి పార్టీ పరంగా పెద్ద పెద్ద పదవులు లాంటివి దక్కలేదు. ఎన్టీఆర్ హయాంలో పార్టీలోకి వచ్చిన ఆయనకు రాజకీయంగా మంచి గుర్తింపు లభించిన పార్టీ పదవుల్లో మొండి చెయ్యి ఎదురైంది. పార్టీ పరంగా కీలక పదవిగా పొలిట్ బ్యూరో కమిటీలో మొన్నటిదాకా ఆయనకు స్థానం లేదు. ఆయన కంటే తర్వాత పార్టీలోకి వచ్చిన అనేక మంది నేతలకు ఆ కమిటీలో స్థానం లభించిన గోరంట్లకు మాత్రం అవకాశం రాలేదు. అదేమంటే కుల సమీకరణాలు మూలంగా రాలేదని చెప్పేవాళ్ళు, అయితే ఈ సారి ఆ పదవి రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముందునుండి గోరంట్ల వర్గం ప్రచారం చేయటం వలన కావచ్చు, లేక బాబు ఆలోచన మారిన ఫలితమో కానీ ఆయనకు పొలిట్ బ్యూరో పదవి లభించింది.

బంధువర్గం కోసం ఆరాటం అవసరమా

 మొన్నటి ఎన్నికల్లో వైసీపీ గాలి బలంగా వీస్తున్న కానీ రాజమండ్రి రూరల్ నుండి పోటీచేసి గెలిచాడు గోరంట్ల, అయితే అయన చూపు మాత్రం రాజమండ్రి సిటీ స్థానం మీద పడింది. ఈ స్థానం నుండి ఆదిరెడ్డి కుటుంబానికి చెందిన ఆదిరెడ్డి భవాని ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రాజమండ్రి అర్బన్ ప్రాంతంలో క్రమక్రమంగా ఆదిరెడ్డి కుటుంబ హవా పెరిగిపోతుంది. టీడీపీ పార్టీ పుట్టిన నాటి నుండి రాజమండ్రిలో టీడీపీ కి పెద్దన్న గా ఉంటున్న గోరంట్లకు ఈ పరిణామం నచ్చటం లేదు. దీనితో ఆ స్థానం నుండి ఆదిరెడ్డి కుటుంబాన్ని పంపించి తన సోదరుడి కొడుక్కి దక్కేలా చేయాలనీ గోరంట్ల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. సిటీ నియోజకవర్గ పరిధిలో టీడీపీని ఆదిరెడ్డి కుటుంబం తమ జేబు సంస్థగా మార్చిందని సంచలన ఆరోపణలు చేస్తున్నారు.

mla adireddy bhavani

పార్టీకి లాభమెంత..? నష్టమెంత..?

 గోరంట్ల చేస్తున్న రాజకీయం టీడీపీ పార్టీకి ఖచ్చితంగా నష్టం కలిగించే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి ఏమంత సరిగ్గా లేదు. ఇలాంటి స్థితిలో పార్టీలో అంతర్గత గొడవలు మంచివి కావు. ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యే లు పార్టీకి దూరం అవుతున్నారు, అలాంటిది ఒక మహిళా ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ గోరంట్ల రాజకీయం చేయటం వలన వాళ్ళు పార్టీకి దూరమయ్యే అవకాశం సృష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో తన సోదరుడి కొడుకు కోసమే గోరంట్ల ఇంతటి రాజకీయం చేస్తున్నాడని ప్రజలు భావించే అవకాశం కూడా లేకపోలేదు. ఇలాంటి పరిణామాలు మంచివి కావు.