Deepika Padukone : గెహ్రాయియేన్: దీపికా పడుకొనే ఎందుకింత ‘తప్ప’ చేసింది.?

Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో దీపికా పడుకొనే పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. అలాంటి దీపికా పడుకొనే, ‘గెహ్రాయియేన్’ అనే చీప్ సినిమా ఎలా చెయ్యగలిగింది.? అనే ప్రశ్న సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

దీపికా పడుకొనే మంచి నటి. ఆమె పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కథా బలమున్న సినిమాలూ చేసింది. ‘అక్రమ సంబంధాల’ నేపథ్యంలో తెరకెక్కిన ‘గెహ్రాయియేన్’ లాంటి సినిమాల్లో నటించాల్సిన ఖర్మ దీపికకి ఎందుకు పట్టింది.? అన్న ఆవేదన ఆమెను అభిమానించేవారిలోనూ కలుగుతోంది.

కథ, కాకరకాయ ఏమీ లేవక్కడ. మూతి ముద్దులు, ఘాటు సన్నివేశాలు. ఒక్కమాటలో చెప్పాలంటే, సమయం.. సందర్భం లేకుండా ‘కోరికలు తీర్చేసుకోవడమే’ పనిగా పెట్టుకున్న ‘కొందరి’ కథ అది. దీన్ని కథ అనడం కన్నా, ఇంకేదన్నా పేరు పెడితే మంచిదేమో.

నటిగా తనకు వద్దకు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ అయినా చేయడానికి తాను సిద్ధమని పలు ఇంటర్వ్యూల్లో దీపిక చెప్పింది. ఇందులో దీపికకి అంతలా ‘ఛాలెంజింగ్’ అనిపించిన సన్నివేశం ఒక్కటైనా వుందా.? నటిగా ఆమె స్థాయికి, ఈ సినిమాలో ఆమె చేసిన ‘ప్రదర్శన’కీ అస్సలేమాత్రం పొంతన కుదరదు.

కేవలం రెమ్యునరేషన్ కోసమే దీపిక ఈ ‘గెహ్రాయియేన్’ సినిమా చేసిందా.? అంటే, అంత దారుణమైన నిర్ణయం ఆమె డబ్బు కోసం తీసుకుంటుందని అనుకోలేం. ఏదో బలమైన కారణం వుంటే తప్ప, ఈ సినిమాలో ఆమె నటించి వుండకపోవచ్చు.. అన్న భావన కలుగుతోంది ఈ ‘గెహ్రాయియేన్’ చూసినవాళ్ళకి.

సి-గ్రేడ్ సినిమాల స్థాయికి దీపిక తనను తాను పడేసుకుందని చెప్పడానికి ‘గెహ్రాయియేన్’ ఓ నిదర్శనం మాత్రమే.